డ్రైవర్లకు ఉచిత కంటి పరీక్షలు.. కళ్లద్దాల పంపిణీ
రేణిగుంట మేజర్ న్యూస్: అమర రాజా గ్రూప్ ఆధ్వర్యంలో కరకంబాడి తయారీ ప్లాంట్‌లో బుధవారం డ్రైవర్లకు ఉచిత కంటి పరీక్షల శిబిరం నిర్వహించారు. తిరుపతిలోని ఎస్‌వీ అరవింద్ కంటి ఆసుపత్రి వైద్య బృందం సహకారంతో నిర్వహించిన ఈ శిబిరంలో సుమారు 200 మంది డ్రైవర్లు కంటి పరీక్షలు చేయించుకోగా, అవసరమైన వారికి ఉచితంగా కళ్లద్దాలు పంపిణీ చేశారు. డ్రైవర్ల ఆరోగ్య పరిరక్షణ, రహదారి భద్రతను పెంపొందించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు అమర రాజా గ్రూప్ ఇంటిగ్రేటెడ్ బిజినెస్ సప్లై చైన్ హెడ్ భారత్ స్వామినాథన్ తెలిపారు. ఈ కార్యక్రమంలో సంస్థకు చెందిన పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.