*కోహెడ మండలంపై మంత్రి పొన్నం ప్రభాకర్‌కు సవతి తల్లి ప్రేమ ఎందుకు రైతుల కష్టాలు ప్రభుత్వానికి కనిపించడం లేదా*
*రైతాంగాన్ని ఆదుకోవడంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోంది. బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఖమ్మం వేంకటేశం*
*కోహెడ మేజర్ మెసేజ్*
కోహెడ మండలాన్ని వెంటనే కరువు మండలంగా ప్రకటించి, కరువు పరిస్థితులతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతాంగాన్ని ఆదుకోవాలని బిజెపి మండల అధ్యక్షుడు జాలిగం రమేష్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కోహెడ మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలని కోరుతూ బీజేపీ కోహెడ మండల శాఖ ఆధ్వర్యంలో మండల అధ్యక్షుడు జాలిగం రమేష్ నేతృత్వంలో కోహెడ మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి ఖమ్మం వేంకటేశం మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిపై తీవ్ర నిరసన వ్యక్తం చేశారు రైతాంగం ఎదుర్కొంటున్న కష్టాలను గుర్తించి, వారికి తక్షణమే ప్రభుత్వ సహాయం అందించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని ఆయన అన్నారు. కరువు పరిస్థితులతో నష్టపోతున్న రైతులకు అండగా నిలవాల్సిన ప్రభుత్వం, కోహెడ మండలాన్ని కరువు మండలంగా ప్రకటించడంలో ఎందుకు జాప్యం చేస్తోందని ప్రశ్నించారు. రైతుల సమస్యలపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే వెంటనే కరువు మండలంగా ప్రకటించి, అర్హులైన రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. మంత్రి పొన్నం ప్రభాకర్ కోహెడ మండలంపై ప్రత్యేక శ్రద్ధ చూపుతారా? లేక సవతి తల్లి ప్రేమ చూపుతున్నారా? అని ప్రశ్నించారు. రైతుల ఇబ్బందులను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాల్సిన ప్రజాప్రతినిధులు, రైతులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. కోహెడ మండల రైతాంగానికి న్యాయం జరిగే వరకు బీజేపీ ప్రజల పక్షాన నిలబడి పోరాటం కొనసాగిస్తుందని ఆయన స్పష్టం చేశారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి కోహెడ మండలాన్ని కరువు మండలంగా ప్రకటించడంతో పాటు, రైతులకు అందాల్సిన సహాయ చర్యలను వెంటనే చేపట్టాలని డిమాండ్ చేశారు కోహెడ మండలాన్ని తక్షణమే కరువు మండలంగా ప్రకటించాలి కరువు పరిస్థితులతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతులను ఆదుకోవాలి అర్హులైన రైతులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం నష్టపరిహారం, సహాయక చర్యలు అందించాల రైతాంగ సమస్యలపై ప్రభుత్వం వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ సర్పంచ్ లు మ్యాకాల స్వర్ణలతసురేందర్ రెడ్డి, పకీడే సంపత్,కాతాం ఆమూల్యరాజశేఖర్ రెడ్డి, బిజెపి జిల్లా కార్యవర్గ సభ్యులు మ్యాకాల రజినీకాంత్ రెడ్డి, పిల్లి నర్సయ్య, బిజెపి మండల ప్రధాన కార్యదర్శి ఖమ్మం సతీష్, మండల ఉపాధ్యక్షుడు సామల గిరిధర్, బిజెపి మండల కార్యదర్శి దానవేని రాజయ్య, మండల కోశాధికారి బండ సుమన్ యాదవ్, బిజెవైఎం జిల్లా ఉపాధ్యక్షుడు కంది సత్యనారాయణ రెడ్డి, వివిధ మోర్చాల మండల అధ్యక్షులు నాగు అజయ్,అన్నాడి లక్ష్మారెడ్డి, బండ జగన్ యాదవ్, పొన్నాల శంకర్, బాణోత్ సురేష్ నాయక్, వివిధ బాధ్యతల్లో ఉన్న బిజెపి నాయకులు చేను తిరుపతి,ఎల్లబోయిన రాజ్ కుమార్, కొండబత్తిని సతీష్, నరాల శ్రీకాంత్, పందిపల్లి రవితేజ,కరివేద అఖిల్ రెడ్డి, కట్ట ప్రవీణ్, ముంజ సాగర్, తలారి సుధాకర్, గోగికారి సతీష్, ద్యాగల శేఖర్, గడ్డం అంకుస్, పిల్లి ప్రకాష్, ప్రహ్లాదరెడ్డి, ఐలేష్, రమేష్, రాములు తులసి ,రాజు, అజయ్, జాలిగం సంపత్, గోగికారి సతీష్,కొండేటి నగేష్, బండారు సాయికిరణ్, దాసరి వెంకటేష్, గూడూరు కుమారస్వామి, పొన్నాల సాగర్, పేసరు శ్రీకాంత్, అన్నాడి మధుసూదన్ రెడ్డి, ఎసిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి, ఎడమల రాజు, తాటిపాముల శంకరయ్య, గంప బాబు, వేముల శ్రీపాల్, బింరెడ్డి లక్ష్మారెడ్డి, ఇట్టిరెడ్డి అమర్ రెడ్డి, మూల లక్ష్మారెడ్డి, ఇట్టిరెడ్డి బాల్ రెడ్డి, రాగుల రాజు, కొమ్మిడి సంజీవరెడ్డి, కరెడ్ల బాపురెడ్డి, మెతుకు రాజిరెడ్డి,పులగుర్ల రాజిరెడ్డి, వట్టిపల్లి రాజేందర్ రెడ్డి, మెట్టు రవీందర్ రెడ్డి, ఇట్టిరెడ్డి రాజిరెడ్డి, కరెడ్ల రాజిరెడ్డి, రాగుల రాకేశ్,అంబిడి రవీందర్,కొమ్మిడి బాల్ రెడ్డి కరెడ్ల వెంకటరెడ్డి, పెరుగు సంజీవరెడ్డి, బండారు శ్రీనివాస్, మారుపాక రాజు, ఇట్టబోయిన శ్రీకాంత్, లింగపల్లి శ్రీనివాస్, విరేశం, రాజు, సత్తయ్య,లక్ష్మణ్, రామాంజనేయులు, తదితరులు పెద్దఎత్తున హాజరయ్యారు.