రైల్వే లెవల్ క్రాసింగ్ మరమ్మతులు
ల్ క్ ప్రతినిధి మేజర్ న్యూస్: చిత్తూరు–సిద్ధంపల్లి రైల్వే స్టేషన్ల మధ్య కిలోమీటర్ 31/23–25 వద్ద, మోసానికల్ గ్రౌండ్ సమీపం లోని రైల్వే లెవల్ క్రాసింగ్ నంబర్–27 వద్ద రైల్వే పట్టాలు అరిగిపోవడంతో మరమ్మతు పనులు చేపట్టనున్నట్లు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు.భారీగా రోడ్డు, రైలు రాకపోకలు సాగుతుండటంతో రైల్వే లెవల్ క్రాసింగ్ వద్ద పట్టాలు దెబ్బతిన్నాయని, ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని రైల్వే శాఖ ఆధ్వర్యంలో ఓవర్‌హాలింగ్ పనులు చేపడుతున్నట్లు పేర్కొన్నారు.ఈ పనులు 2026 అక్టోబర్ 27వ తేదీ నుంచి నవంబర్ 2వ తేదీ వరకు కొనసాగనున్న నేపథ్యంలో, ఆయా తేదీల్లో లెవల్ క్రాసింగ్ మీదుగా రాకపోకలు సాగించే వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను వినియోగించుకోవాలని సూచించారు. మరమ్మతు పనులు సజావుగా నిర్వహించేందుకు, ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా సంబంధిత అధికారులు అవసరమైన ఏర్పాట్లు చేయాలని తెలిపారు. ప్రజల భద్రతకు ప్రాధాన్యతనిస్తూ వాహనదారులు అధికారులకు సహకరించాలని కోరారు.