మక్కువ.. ఎవరికి ఎక్కువ
మక్కువ, సూర్య : సాలూరు శాసనసభ నియోజకవర్గం అంతా మక్కువ మండల రాజకీయాల వైపు ఉత్కంఠగా చూస్తున్నారు. నియోజకవర్గం రాజకీయాలనే శాసించే, మక్కువ మండల ఓటర్లు ప్రస్తుతం జరుగుతున్న మండల పరిషత్ ఎన్నికల్లో ఎవరికి పట్టం కడతారో అన్న ఉత్కంఠతో రాజకీయ పక్షాలు ఓటర్ల ప్రసన్నం కోసం పావులు కదుపుతున్నారు. మహిళకు కేటాయించిన మక్కువ మండల పీఠాన్ని అధిష్టించనున్న "ఆమె" ఎవరో అన్న ఉత్కంఠ ప్రతి ఒక్కరిలో నెలకొంది. 14 ఎంపీటీసీ స్థానాలు కలిగి ఉన్న మక్కువ మండలంలో, మండల ప్రజలు ఎవరికి పట్టం కడతారో తెలియక ఇరుపక్షాలు ఎవరికి వారు అంచనాలు వేసుకుంటున్నారు. ప్రతిపక్ష వైసిపి మాత్రం మండల పీఠం తమకే దక్కుతుందన్న ధీమాతో ఎన్నికల బరిలో రాజకీయ ఎత్తుగడలతో అడుగులు వేస్తున్నారు. ఇక అధికార టిడిపి కూడా మెజారిటీ ఎంపీటీసీలు దక్కించుకొని మండల పీఠాన్ని అధిష్టించేందుకు అధికార బలంతో ముందుకు సాగుతున్నారు. ప్రతిపక్ష వైసిపి మక్కువ -2 ఎంపీటీసీ తో సహా , మండలంలో మెజారిటీ ఎంపీటీసీలు కైవసం చేసుకుంటే.? మక్కువ ఎంపీపీగా మండల వైసీపీ అధ్యక్షులు మావుడి రంగునాయుడు సతీమణి మావుడి రామలక్ష్మి ని ఎంపీపీ పీఠంపై కూర్చోపెట్టినందుకు ప్రణాళిక తో ఎన్నికల బరిలో సాగుతున్నారు. ఇక అధికార టిడిపి నాయకత్వం పార్టీ అధికారంలో ఉందన్న బలం తో, అభివృద్ధి మంత్రం వినిపిస్తూ, మంత్రి గుమ్మడి సంధ్యారాణి మార్కుతో ఎన్నికల బరిలోకి దిగారు. టిడిపి కాశీపట్నం తో సహా మెజార్టీ ఎంపీటీసీ స్థానాలు దక్కించుకుంటే , మండల పీఠాన్ని ప్రస్తుత మండల టిడిపి అధ్యక్షులు గుళ్ల వేణుగోపాలనాయుడు సతీమణి గుళ్ల వెంకటరత్నం అధిష్టించనున్నారు. అయితే మండల టిడిపి కి కంటిలో నలుసులా సీనియర్ నాయకులు పెంట తిరుపతిరావు తయారయ్యారని తప్పక తప్పదు. జరుగుతున్న మండల ప్రాదేశిక ఎన్నికల భాగంగా తమ స్వగ్రామమైన ఏ వెంకంపేటతో సహా 8 చోట్ల ఎంపీటీసీ అభ్యర్థులను బీఎస్పీ తరఫున పోటీలోకి దింపారు. తమ అభ్యర్థుల గెలుస్తారన్న కాకుండా , టిడిపి అభ్యర్థులను ఓడించాలన్న దృఢ సంకల్పంతో బీఎస్పీ తరఫున తమ అభ్యర్థులను పోటీలోకి దింపుతున్నట్టు పెంట తిరుపతిరావు బహిరంగంగా చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రస్తుత మండల పార్టీ అధ్యక్షులు గుళ్ల వేణుగోపాలనాయుడు సతీమణి గుళ్ల వెంకట రత్నం తమ స్వగ్రామమైన ఏ వెంకంపేటలో పోటీ చేయకుండా , టిడిపికి అనుకూలంగా ఉన్న కాశీపట్నం ఎంపీటీసీ సెగ్మెంట్లో పోటీ చేస్తున్నారు. పెంట తిరుపతిరావు తమ సతీమణి పెంట ఉమాను తమ స్వగ్రామమైన ఏ వెంకంపేటలో బీఎస్పీ తరఫున ఎంపీటీసీ బరిలో దింపారు. ఈమె 2014 - 2019 మధ్య టిడిపి హాయంలో మక్కువ ఎంపీపీ పీఠాన్ని అధిష్టించారు. మరి పెంట తిరుపతి రావు ప్రభావం టిడిపి పై ఏ మేరకు ఉంటుందో వేచి చూడాల్సి ఉంది. ఇకపోతే మండల కేంద్రమైన మక్కువలో రెండు ఎంపీటీసీ స్థానాలు కలిగి ఉన్నాయి. మక్కువ - 1 ఎంపీటీసీ స్థానం ఎస్సీ మహిళకు కేటాయించగా , మక్కువ -2 ఎంపీటీసీ స్థానం అన్ రిజర్వుడు కేటాయించారు. దీంతో మండల పీఠాన్ని దక్కించుకోవాలన్న సంకల్పంతో వైసిపి వర్గాలు మండల వైసీపీ నాయకులైన మావుడి రంగునాయుడు సతీమణి మావుడి రామలక్ష్మి పి తొలిసారిగా ఎన్నికల రంగంలోకి దింపిన సంగతి తెలిసినదే.! ఆమెతో పాటు మండలంలో అధిక మెజార్టీ ఎంపీటీసీ స్థానాలు వైసిపి కైవసం చేసుకుంటే మండల పీఠం పై మావుడి రామలక్ష్మి అధిష్టించనున్నారు. ఇకపోతే మండల కేంద్రమైన మక్కువలో గల రెండు ఎంపీటీసీ స్థానాలకు మావుడి వారి కుటుంబీకులైన సీనియర్ పొలిటీషియన్ మావుడి ప్రసాదరావు కూడా తమ అభ్యర్థులను జనసేన తరఫున బరిలోకి దింపారు. అయితే మావుడి ప్రసాదరావు బరిలోకి దింపిన అభ్యర్థుల ప్రభావం తెలుగుదేశం పార్టీపై ఉంటుందా.. లేదా వైసీపీ పై ఉంటుందో ఎదురు చూడాల్సింది.
రిపోర్టర్ : తిరుపతిరావు, మక్కువ, పార్వతీపురం మన్యం.