BREAKING
రాపూరు బీజేపీలో అసమ్మతి సెగ.. మండల నాయకుల పార్టీ పదవులకు రాజీనామా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మెగా కోడలు ఉపాసన.. తాతగారితో కలిసి ప్రత్యేక పూజలు వారం రోజుల్లో సీఎంఆర్ బకాయిలు చెల్లించాలి : అదనపు కలెక్టర్ కె. చంద్రారెడ్డి 15వ వార్డులో హోరెత్తిన టీడీపీ ఎన్నికల ప్రచారం అదితీ రావు హైదరి గ్లామరస్ ఫొటోషూట్.. నెట్టింట వైరల్ అవుతున్న టాలీవుడ్ బ్యూటీ లేటెస్ట్ పిక్స్ పువ్వాడి దంపతులకు సత్కారం తీవ్రవాదులకు జగన్ కు తేడా నే లేదు. 30 న భరద్వాజ మాస్టర్ జన్మదినోత్సవ వేడుకలు... జాహ్నవికి అఖండ విజయం అందించండి జనసందోహంతో దద్దరిల్లిన బుజబుజ నెల్లూరు - వేలాదిమందితో భారీ ర్యాలీ ఆరు నెలల క్రితమే వివాహం.. వివాహిత ఆత్మహత్య బైరెడ్డి జాహ్నవిని అఖండ మెజారిటీతో గెలిపించాలి సైకిల్ గుర్తుకు ఓటేయండి అభివృద్ధికి బాటలు వేయండి* అలియాబాద్‌లో బఫర్‌ జోన్‌లో భారీ షెడ్‌ నిర్మాణంపై ఆరోపణలు.. అనుమతులపై అధికారుల విచారణ ఏదీ..? ఎంపిపి పువ్వాడి వెంకటేశ్వర్లు కు సత్కారం

యాభై ఏళ్లుగా ప్రజలకు విశేష సేవలందిస్తున్న "బొమ్మిరెడ్డి " కుటుంబం -విశేష వైద్య సేవలు

Select Suryaa Now
యాభై ఏళ్లుగా ప్రజలకు విశేష సేవలందిస్తున్న "బొమ్మిరెడ్డి " కుటుంబం -విశేష వైద్య సేవలు

ఆత్మకూరు, మేజర్ న్యూస్ : 
ఆత్మకూరు పట్టణంలో, మండలంలో, నియోజకవర్గం లో బొమ్మిరెడ్డి సుందరరామిరెడ్డి కుటుంబం విశేష వైద్యసేవలు, ప్రత్యేక ప్రజాసేవలు, స్వంత నిధులతో సామాజిక సేవలను అందించారు. ఆయన వారసులు సేవలను కొనసాగిస్తున్నారు.
ఆ కుటుంబ పెద్ద డాక్టర్ బొమ్మిరెడ్డి సుందరరామిరెడ్డి

ఆయన తొలుత ప్రభుత్వ వైద్యాధికారిగా ఆత్మకూరు ప్రజలకు సేవలు అందించారు. అనంతరం స్వతహాగా బిఎస్సార్ హాస్పిటల్ ను ఏర్పాటు చేసి ఆత్మకూరు తాలూకాతో పాటు బద్వేలు, ఉదయగిరి ప్రాంతాల నుండి కూడా వచ్చే ప్రజలకు ఉచితంగా వైద్య సేవలు అందించి పేదల డాక్టర్ గా పేరు గడించారు. నేదురుమల్లి జనార్దన్ రెడ్డి తదితర ప్రముఖుల సాన్నిహిత్యం తొ వారి ఆహ్వానం మేరకు డాక్టర్ సుందర్ రామిరెడ్డి కాంగ్రెస్ పార్టీలో ప్రవేశించి ప్రజాక్షేత్రంలో అడుగుపెట్టి మూడు దఫాలు శాసనసభ్యులుగా ఎన్నికై నాలుగేళ్ల పాటు రాష్ట్ర ఆర్థిక సంస్థ చైర్మన్గా క్యాబినెట్ ర్యాంకులో వ్యవహరించారు. ఆత్మకూరు నియోజకవర్గంలో ప్రముఖ వైద్యులుగా పేరుగాంచిన డాక్టర్ సుందర్ రామిరెడ్డి ప్రజలకు తన వంతు సేవలు అందించాలని ప్రత్యేకంగా దృష్టి సారించారు. తొట్ట తొలుతగా నాటి ప్రభుత్వం సహకార రంగంలో విద్యుత్ సంస్థలను రీకో పేరుతో జిల్లాకు ఒకటి కేటాయించాలని నిర్ణయించగా డాక్టర్ సుందర్ రామిరెడ్డి ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని ప్రయత్నించి నెల్లూరు జిల్లాలో ఏకైక సంస్థను ఆత్మకూరు నియోజకవర్గానికి సాధించారు. దాంతోపాటు ఏకకాలంలో 45 మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించారు. దాంతోపాటు కాంగ్రెస్ ప్రభుత్వం రాజీవ్ గాంధీ సంస్మరణార్థం రాష్ట్రంలో ఏదేని ముఖ్యమైన కార్యక్రమం చేపట్టాలని తలంచి రాజీవ్ వాటర్ మిషన్ పేరుతో గ్రామీణ ప్రాంతాలకు త్రాగునీటిని అందించాలని జిల్లాకొక బృహత్తర ఆర్ డబ్యుయస్ పథకాన్ని మంజూరు చేసేలా నిర్ణయించారు. ఆర్డబ్ల్యూఎస్ రాష్ట్ర చైర్మన్గా కే.కేశవరావు నియమితులు కాగా ఆయనతో ఉన్న సాన్నిత్యంతో డాక్టర్ సుందర్ రామి రెడ్డి ప్రత్యేకంగా ప్రయత్నించి ఆర్డబ్ల్యూఎస్ ప్రాజెక్టును ఆత్మకూరుకు మంజూరు చేయించారు. జిల్లాలోనే ఏకైక ఆర్డబ్ల్యూఎస్ బృహత్తర ప్రాజెక్టు ఆత్మకూరుకు రాగా 6 కోట్ల 65 లక్షల రూపాయలతో 123 గ్రామాలకు త్రాగునీటి సౌకర్యం లభించింది. సిండికేట్ రైతు సేవా సహకార సంఘాలను జిల్లాలో రెండు చోట్ల ఏర్పాటు చేయమనగా ఒక సొసైటీని ఆత్మకూరులో ఏర్పాటు చేయించారు. ఆత్మకూరు పట్టణంలో ముస్లింలు, దళితుల సౌకర్యార్థం రెండు షాదీ మంజిల్స్, రెండు కమ్యూనిటీ హాల్స్ ను ఏర్పాటు చేయించారు. గ్రామీణ ప్రాంతాల్లో తొట్ట తొలుతగా ప్రభుత్వం ద్వారా గృహ నిర్మాణ కార్యక్రమాన్ని డాక్టర్ సుందర్రామిరెడ్డి  చేపట్టి పలు గ్రామాల్లో దళిత, బడుగు బలహీన వర్గాలకు పక్కా గృహాలను మంజూరు చేయించారు. ఆత్మకూరులో ఆర్డబ్ల్యూఎస్ డివిజన్ కార్యాలయాన్ని ఏర్పాటు చేయించారు. గండువారి పల్లి,ఏఎస్పేట, హసనాపురం, కావలి ఎడవల్లి, మహమ్మదాపురం తదితర గ్రామాల్లో చేనేత కార్మికులకు పక్కా గృహాలు మంజూరు చేయించడంతోపాటు రాష్ట్ర ఆర్థిక సంస్థ చైర్మన్గా డాక్టర్ సుందర రామిరెడ్డి తమ సంస్థ ద్వారా చేనేత కార్మికుల మగ్గాలు ఏర్పాటు చేసుకునేందుకు ఆర్థిక సాయం అందించారు. వరదల సమయంలో గ్రామాలకు ఇబ్బందిగా ఉన్న కొమ్మలేరు, పందల వాగుల కలుజుల నిర్మాణానికి కోటి రూపాయల వంతున నూతన రెండు కోట్ల రూపాయలను మంజూరు చేయించారు. అప్పటి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ మదన్మోహన్ వద్ద ఉన్న సాన్నిహిత్యం తో డాక్టర్ బి సుందర్ రామిరెడ్డి ఆత్మకూరు మండలంలో మేజర్ గ్రామంగా ఉన్న మహిమలూరులో ఒక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని, చేజర్ల మండలంలో పెద్ద గ్రామంగా ఉన్న పెళ్లేరుకు ఒక  పశువైద్యశాలను మంజూరు చేయించారు. ఆత్మకూరులో డిగ్రీ కాలేజీ లేక అందరూ ఇబ్బంది పడుతున్న తరుణంలో మునకు ప్రాంతంలోని మాధవరం నుండి డాక్టర్ ఎస్ ఆర్ జే డిగ్రీ కళాశాలను మరోచోటకు తరలించే ప్రయత్నం తెలుసుకున్న డాక్టర్ సుందర్ రామిరెడ్డి ప్రత్యేకంగా కృషి చేసి ఆ డిగ్రీ కాలేజీని ఆత్మకూరుకు రప్పించి వారికి కాంగ్రెస్ భవనంలో మౌలిక వసతులు కూడా కల్పించారు. సాంకేతిక విద్య ఈ ప్రాంత వాసులకు అందించాలని లక్ష్యంగా డాక్టర్ సుందరరామిరెడ్డి బి ఎస్ ఆర్ ఐ టి ఐ ను మంజూరు చేయించారు. నియోజకవర్గంలోని గ్రామీణ ప్రాంతాల్లోని అన్ని ఎస్సీ ఎస్టీ కాలనీలకు విద్యుత్ సౌకర్యం కల్పించారు. వీర్లగుడిపాడు, బోటికర్లపాడు తదితర మారుమూల గ్రామాలకు ఎలాంటి రోడ్డు వసతి లేకపోగా అప్పటి కలెక్టర్ డాక్టర్ సాంబశివరావును ప్రత్యేకంగా తీసుకొచ్చి నెలలోపు రోడ్లు ఏర్పాటు చేసి బస్సులను ఆయా గ్రామాలకు నడిపించిన ఘనత డాక్టర్ బి సుందర్ రావ్ రెడ్డిదేనని  ఇప్పటికీ వారు చెబుతుంటారు. సోమశిల ఉత్తర కాలువ ద్వారా ఆత్మకూరు చెరువుకు సాగునీరు పుష్కలంగా లభించేందుకు ప్రత్యేకంగా కృషి చేశారు. ఉత్తర కాలువ ఏర్పాటులో డాక్టర్ సుందర్ రావ్ రెడ్డి కీలక పాత్ర పోషించారు. గతంలో విద్యాసంస్థల్లో మధ్యాహ్నం భోజనం లేని సమయంలో ఆత్మకూరులోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జూనియర్ ఇంటర్ సీనియర్ అభ్యసించే విద్యార్థులకు తమ ట్రస్టు ద్వారా మధ్యాహ్నం భోజన వసతి కల్పించి ఐదేళ్లపాటు ఆ పథకాన్ని స్వతహాగా నిధులతో కొనసాగించారు. తమ ట్రస్ట్ ద్వారా వేలాది మందికి నేత్ర వైద్య పరీక్షలు శస్త్ర చికిత్సలు చేయించి వేలాది మందికి దృష్టి ప్రసాదించి ట్రస్టు ద్వారా ఉచితంగా కళ్ళజోళ్ళను, మందులను కూడా పంపిణీ చేయించారు.ఆత్మకూరులో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో రక్త నిల్వ కేంద్రాన్ని ఏర్పాటు చేయించడంలో డాక్టర్ సుందరరామిరెడ్డి ప్రత్యేకంగా కృషి చేశాడు. ఆత్మకూరులో కేవలం 10 బెడ్లతో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిని అభివృద్ధి పరిచి పేద ప్రజలకు వైద్యం సేవలు మెరుగ్గా అందించాలనే లక్ష్యంతో డాక్టర్ సుందర్ రామిరెడ్డి ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ప్రయత్నించి 30 పడకల ఆసుపత్రిగా అప్ గ్రేడ్ చేయించారు.
డాక్టర్ బి ఎస్ ఆర్ తనయుడు డాక్టర్ బొమ్మిరెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి 
ఆత్మకూరు సీనియర్ నాయకులు, బి ఎస్ ఆర్ హాస్పిటల్ వ్యవస్థాపకులు, మూడు దఫాలు శాసనసభ్యులుగా, నాలుగు సంవత్సరాలు రాష్ట్ర ఆర్థిక సంస్థ చైర్మన్గా వ్యవహరించిన డాక్టర్ బొమ్మిరెడ్డి సుందరరామిరెడ్డి తనయుడైన డాక్టర్ బొమ్మిరెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి వైద్య నిపుణులుగా తమ హాస్పిటల్ ద్వారా ఆత్మకూరు పట్టణ, మండల, నియోజకవర్గ, బద్వేలు,ఉదయగిరి ప్రాంత ప్రజలకు విశేష వైద్య సేవలు అందించారు. ఆయన తొలుత ఆత్మకూరు ఆర్టీసీ నేషనల్ మజ్దూర్ యూనియన్ డిపో గౌరవాధ్యక్షులుగా ఎన్నికై కార్మికుల అభివృద్ధి, సంక్షేమం కోసం, న్యాయమైన కోర్కెల సాధన కోసం, హక్కుల పరిరక్షణ కోసం విశేషంగా కృషి చేశారు.అనంతరం ఆయన రాజకీయ రంగ ప్రవేశం చేసి ప్రజాక్షేత్రంలో అడుగుపెట్టి ఎంపీటీసీ సభ్యులుగా ఎన్నికై ఆత్మకూరు మండల అధ్యక్ష పదవిని చేపట్టారు. మండల అధ్యక్షుడుగా బాధ్యతలు స్వీకరించిన డాక్టర్ రవీంద్రనాథ్ రెడ్డి తొలి సంతకంగా మండలంలోని కరటంపాడు గ్రామంలోని రామాపురంలో తాగునీటి సమస్యతో సతమతమవుతున్న ప్రజల సమస్య పరిష్కారం కోసం తొలి సంతకం చేసి తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించారు. అనంతరం ఆయన ఆత్మకూరు మండలాధ్యక్షుడుగా మండలంలో అన్ని వర్గాల సంక్షేమం కోసం, అన్ని గ్రామాల అభివృద్ధి కోసం ప్రత్యేకంగా కృషి చేశారు. పాఠశాలల విద్యా కమిటీ మండల చైర్మన్ గా అనేక పాఠశాలలకు నూతన భవనాలను అప్పటి కలెక్టర్ డాక్టర్ ప్రేమచంద్ ద్వారా మంజూరు చేయించారు. అనంతరం మరో ఐదేళ్లపాటు ఎంపిటిసి మెంబర్గా కూడా గెలుపొంది కొనసాగారు. తదుపరి ఆత్మకూరు మేజర్ పంచాయతీ సర్పంచిగా ఆయన అఖండ విజయం సాధించి ఐదేళ్లపాటు సర్పంచిగా వ్యవహరించారు. సర్పంచ్ గా ఉన్న కాలంలో నేరుగా అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి వద్దకు వెళ్లి పట్టణంలో త్రాగునీటికి ప్రజలు పడుతున్న ఇబ్బందులను వివరించి అప్పారావుపాలెం నుండి ఆత్మకూరు పట్టణానికి తాగునీరు అందించే బృహత్తర పథకాన్ని మంజూరు చేయించారు. ఆత్మకూరు పట్టణంలో అన్ని ప్రాంతాల్లో త్రాగునీరు అందించేలా, అన్ని వీధుల్లో వీధి దీపాలు వెలిగేలా ఏర్పాటు కావించారు. ఆత్మకూరులోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు జూనియర్ కాలేజీకి అదనపు భవనాలను కూడా డాక్టర్ రవీంద్రనాథ్ రెడ్డి మంజూరు చేయించారు.జిల్లా టెలికమ్ సలహామండలి సభ్యులుగా నియమితులై ఆత్మకూరు ప్రాంతంలో టెలికామ్ వ్యవస్థను బలోపేతం చేసి ఏక కాలంలో 100టెలిఫోన్ కనెక్షన్లు మంజూరు చేయించారు.ఉపాధ్యాయ బదిలీల్లో అత్యంత పారదర్శకంగా వ్యవహరించిన డాక్టర్ రవీంద్రనాథ్ రెడ్డి అన్ని వర్గాల ప్రశంసలు పొందారు.
డాక్టర్ సుందరరామిరెడ్డి కోడలు, డాక్టర్ రవీంద్రనాథ్ రెడ్డి సతీమణి, బి ఎస్ ఆర్ హాస్పిటల్ నిర్వాకురాలు డాక్టర్ బొమ్మిరెడ్డి షకీలారెడ్డి నలభై సంవత్సరాలుగా తమ హాస్పెటల్ ద్వారా ప్రజలకు వైద్య సేవలందిస్తూ కరోనా సమయంలో స్వంతనిధులతో భారీగా అనేక పేదవర్గాల ప్రజలకు సరుకులు పంపిణీ చేశారు.స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పేదవర్గాలు వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించుకునేందుకు స్వంత నిధులను సమకూర్చారు.డాక్టర్ సుందర రామిరెడ్డి మనుమడు, డాక్టర్ రవీంద్రనాథ్ రెడ్డి, డాక్టర్ బొమ్మిరెడ్డి షకీలా దంపతుల కుమారుడు, యువనేత, బి ఎస్ ఆర్ ట్రస్ట్ చైర్మన్ బొమ్మిరెడ్డి తారక్ నాథ్ రెడ్డి కరోనా సమయంలో పేదవర్గాలకు తనవంతు ఆర్థిక చేయూత ఇచ్చారు. రంజాన్ సందర్బంగా మౌజుములు, ఇమాములకు ఆర్థిక సాయమందిస్తున్నారు. వారు చేస్తున్న వైద్య సేవలు, సామాజిక సేవలతోపాటు ఆత్మకూరు అభివృద్ధిని ఆకాంక్షించి అభివృద్ధిప్రదాత రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామ నారాయణ రెడ్డి ఆహ్వానం మేరకు తల్లీ, తనయులు డాక్టర్ షకీలా, తారక్ నాథ్ రెడ్డి లు తెలుగుదేశంలో ప్రవేశించారు. ఆత్మకూరు మున్సిపల్ టిడిపి చైర్మన్ అభ్యర్థిగా కూటమి ఆధ్వర్యంలో పోటీకి దిగారు. తాముచేస్తున్న సేవలతోపాటు ఆత్మకూరును అభివృద్ధి చేయాలని, బొమ్మిరెడ్డి కుటుంబసేవలు కొనసాగిస్తూనే ప్రజా సేవ చేయాలన్న సంకల్పంతో రాజకీయ రంగప్రవేశం చేసి మున్సిపల్ బరిలో పోటీకి దిగి ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. అనాదిగా బొమ్మిరెడ్డి కుటుంబం అందిస్తున్న సేవలు, మంత్రి ఆనం రామ నారాయణ రెడ్డి చేస్తున్న అభివృద్ధిని అందరూ గుర్తించి ఎన్నికల్లో విజయం చేకూర్చాలని డాక్టర్ షకీలా, తారక్ నాథ్ రెడ్డి కోరుతున్నారు. వారికి విశేష ప్రజాదరణ లభిస్తోంది. విజయపదంలో దూసుకెళుతున్నారు.