బైరెడ్డి జాహ్నవిని అఖండ మెజారిటీతో గెలిపించాలి
- ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వ సంక్షేమం వివరించాలి
- పామూరులో అత్యధిక మెజారిటీ సాధించడమే లక్ష్యం
- ఎంపీపీ పువ్వాడి వెంకటేశ్వర్లు పిలుపు
పామూరు, మేజర్ న్యూస్ : పామూరు మండల టిడిపి కూటమి జడ్పీటీసీ అభ్యర్థి డాక్టర్ బైరెడ్డి జాహ్నవిని అఖండ మెజారిటీతో గెలిపించేందుకు టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు సమష్టిగా కృషి చేయాలని ఎంపిపి పువ్వాడి వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు. బుధవారం పట్టణంలోని శేష మహల్ థియేటర్ ప్రాంగణంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పామూరు సింగిల్ విండో మాజీ అధ్యక్షుడు బైరెడ్డి జయరామిరెడ్డి కుమార్తె డాక్టర్ బైరెడ్డి జాహ్నవి పామూరు మండల జడ్పీటీసీ అభ్యర్థిగా పోటీలో ఉన్నారని తెలిపారు. నవంబర్ 5 న జరిగే ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై ఓటు వేసి ఆమెను అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరారు. నేటి నుంచి మండల పరిధిలోని ప్రతి గ్రామంలో ప్రతి ఇంటికీ టీడీపీ నాయకులు, కార్యకర్తలు వెళ్లి ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలని సూచించారు. జడ్పీటీసీ ఎన్నికల్లో టీడీపీ గెలుపు ఖాయమని నియోజకవర్గంలోని ఇతర మండలాల కంటే పామూరులో అత్యధిక మెజారిటీ సాధించేలా ప్రతి కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో టీడీపీ విభిన్న ప్రతిభావంతుల రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అడుసుమల్లి ప్రభాకర్ చౌదరి, టిడిపి మండల అధ్యక్షుడు బొల్లా నరసింహారావు, జడ్పీటీసీ అభ్యర్థి బైరెడ్డి జాహ్నవి రెడ్డి, గుంటుపల్లి శ్రీనివాసులు, పువ్వాడి వెంకటేశ్వర్లు బిల్డర్, పువ్వాడి రామారావు, యాదాల వెంకట సాయి కిరణ్, బైరెడ్డి జయరామిరెడ్డి, బైరెడ్డి జస్వంత్ రెడ్డి, ఉప్పలపాటి హరిబాబు, కొండిశెట్టి రమణయ్య, రహీముల్లా, సయ్యద్ అమీర్ బాబు, ఇర్రి కోటిరెడ్డి, అంచూరి వెంకటరెడ్డి, ఆర్‌ఆర్ రఫీ, వాయినేని రాఘవ, నొస్సం నాగేంద్ర చారి, హజరత్ తదితరులు పాల్గొన్నారు.