జాహ్నవికి అఖండ విజయం అందించండి
- తండ్రి అడుగుజాడల్లో ప్రజాసేవకు జాహ్నవి రెడ్డి
- సైకిల్ గుర్తుపై ఓటేసి భారీ మెజారిటీతో గెలిపించాలి
పామూరు, మేజర్ న్యూస్ : తన కుమార్తె టీడీపీ కూటమి జడ్పీటీసీ అభ్యర్థి డాక్టర్ బైరెడ్డి జాహ్నవి రెడ్డిని నవంబర్ 5న జరిగే ఎన్నికల్లో అఖండ మెజారిటీతో గెలిపించాలని పామూరు మండల మాజీ సింగిల్ విండో మాజీ అధ్యక్షుడు బైరెడ్డి జయరామిరెడ్డి కోరారు. పామూరు మండల జడ్పీటీసీ స్థానానికి తన కుమార్తె జాహ్నవి రెడ్డి టీడీపీ కూటమి అభ్యర్థిగా ఎన్నికల బరిలో నిలిచిందని తెలిపారు. ప్రజలతో తనకు ఉన్న సుదీర్ఘ అనుబంధాన్ని కొనసాగిస్తూ తన కుమార్తెను ప్రజాసేవలోకి తీసుకువస్తున్నామని ఆమెకు మండల ప్రజలు ఆశీస్సులు అందించాలని కోరారు. నవంబర్ 5న జరిగే జడ్పిటిసి ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై ఓటు వేసి జాహ్నవి రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. పామూరు మండల అభివృద్ధి, ప్రజల సమస్యల పరిష్కారానికి జాహ్నవి రెడ్డి నిరంతరం కృషి చేస్తారని పేర్కొన్నారు. ఆమె విజయానికి టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు సమష్టిగా కృషి చేసి మండలంలోని ప్రతి గ్రామంలో విస్తృత ప్రచారం నిర్వహించాలని జయరామిరెడ్డి పిలుపునిచ్చారు.