సైకిల్ గుర్తుకు ఓటేయండి అభివృద్ధికి బాటలు వేయండి*
*మండలంలో స్పీడ్ తగ్గని టీడీపీ ప్రచారం*
కుందుర్ప
సైకిల్ గుర్తుకు ఓటువేసి అభివృద్ధికి బాటలు వేయాలంటూ మండలం టీడీపీ ఎన్నికల ప్రచారం ముమ్మరం చెసింది. స్థానిక ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలుగుదేశం పార్టీ గత రెండు రోజుల నుండి ప్రచారంలో ఎక్కడ స్పీడు తగ్గకుండా ప్రచారం నిర్వహిస్తుంది. తెలుగుదేశంపార్టీ జడ్పిటిసి అభ్యర్థి జి ప్రభావతి, ఎంపీటీసీ అభ్యర్థి రూపాల సైకిల్ గుర్తుకు ఓటు వేసి అభివృద్ధికి సహకరించాలంటూ తెలుగుదేశంపార్టీ బుధవారం ఎనుములదొడ్డి పంచాయతీలో జరిగిన ఎన్నికల ప్రచారంలో ప్రజలకు పిలుపునిచ్చారు. ఇప్పటికే నియోజకవర్గంలో ఎమ్మెల్యే అనేకఅభివృద్ధి కార్యక్రమాలను నిర్వహించారని స్థానిక ఎన్నికల్లో సైకిల్ గుర్తుకు ఓటువేసి తెలుగుదేశంపార్టీ అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపిస్తే మండల అభివృద్ధికి మరింత మంచి బాటలు వేసినట్లు అవుతుందని, సైకిల్ గుర్తుకుఓటు వేయాలంటూ వారు ప్రజలను అభ్యర్థించారు. నియోజకవర్గంలో ప్రజల అవసరాల కోసం అనేక అభివృద్ధి పథకాలు అందిస్తున్న ఎమ్మెల్యే మరింత నియోజకవర్గం అభివృద్ధి వైపుఅడుగులు వేసేందుకు సైకిల్ గుర్తుకు ఓటు వేసి సహకరించాలన్నారు.ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
*రాజు సూర్య రిపోర్టర్ కుందుర్పి*9701043369