ఎంపిపి పువ్వాడి వెంకటేశ్వర్లు కు సత్కారం
- మల్లెబోయిన బాల బ్రహ్మయ్య యాదవ్ నేతృత్వంలో తిరలదిన్నె టీడీపీ నేతలు అభినందనలు
పామూరు, మేజర్ న్యూస్ : పామూరు మండల ఎంపీపీగా ఏకగ్రీవంగా ఎన్నికైన పువ్వాడి వెంకటేశ్వర్లును టీడీపీ నేతలు ఘనంగా సత్కరించి అభినందనలు తెలిపారు. బుధవారం పట్టణంలోని శేష్‌మహల్ థియేటర్ ప్రాంగణంలో తెలుగుదేశం పార్టీ బీసీ సెల్ మండల అధ్యక్షుడు మల్లెబోయిన బాల బ్రహ్మయ్య యాదవ్ నేతృత్వంలో తిరలదిన్నె టీడీపీ నాయకులు బుధవారం పువ్వాడి వెంకటేశ్వర్లును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎంపీపీ పువ్వాడి వెంకటేశ్వర్లు, ఆయన సతీమణి తూర్పు కోడిగుడ్లపాడు ఎంపీటీసీ సభ్యులు పువ్వాడి వెంకటలక్ష్మి కి పూలమాలలు వేసి శాలువాతో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఎంపిపిగా పువ్వాడి వెంకటేశ్వర్లు ప్రజలకు అందుబాటులో ఉంటూ మండలంలోని అన్ని గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలని ఆకాంక్షించారు. ఆయన నాయకత్వంలో మండలం మరింత అభివృద్ధి సాధించాలని కోరారు. కార్యక్రమంలో తిరలదిన్నె టీడీపీ బూత్ ఇన్‌చార్జి ఆవుల రమణమ్మ, టిడిపి మండల నాయకులు పువ్వాడి వెంకటేశ్వర్లు బిల్డర్, తో పాటు పలువురు టీడీపీ నాయకులు పాల్గొని పువ్వాడి వెంకటేశ్వర్లుకు అభినందనలు తెలిపారు.