కూటమి అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా పనిచేయాలి
పార్వతీపురం, సూర్య : పార్వతీపురం మండలంలో జడ్పీటీసీ బీజేపీ అభ్యర్థి ద్వారపురెడ్డి శ్రీనివాసరావుతో పాటు అన్ని ఎంపీటీసీ స్థానాల గెలుపే లక్ష్యంగా ప్రతి కార్యకర్త పనిచేయాలని పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర పిలుపునిచ్చారు. బుధవారం టీడీపీ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన పార్వతీపురం మండల పార్టీ అభ్యర్థుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గత రెండున్నరేళ్లుగా గ్రామాలలో మనం చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించి నూటికి నూరు శాతం విజయం సాధించాలన్నారు. జడ్పీటీసీ అభ్యర్థి కమలం గుర్తుపై విస్తృతంగా ప్రచారం చేయాలని, గ్రామంలో ఐక్యంగా కార్యకర్తలందరూ పనిచేయాలని, కార్యకర్తలతో పాటు తాను కూడా ప్రచారంలో పాల్గొంటానని ఎమ్మెల్యే తెలిపారు.
రిపోర్టర్ : ఎస్ఎస్ నాయుడు, పార్వతిపురం మన్యం.