ఓట్ల వేటకు"అర్నబ్ "దెబ్బ..బ్రేక్ పడిన అభ్యర్థుల ప్రచారం! * స్తంభించిన స్థానిక సంస్థల ప్రచార పర్వం *
గరుగుబిల్లి, సూర్య : అర్నబ్ తుఫాను ప్రభావం కారణంగా అభ్యర్థుల ప్రచారానికి బ్రేక్ పడింది.అర్నబ్ తుఫాను ధాటికి స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారం పూర్తిగా స్తంభించిపోయింది.తీరం దాటిన ఈతీవ్ర తుఫాను సృష్టించిన బీభత్సం వల్ల ఎంపీటీసీ, జెడ్పీటీసీ, అభ్యర్థులు ఓటర్లను కలుసుకోలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.అర్నబ్ తుఫాను ప్రభావం ప్రత్యక్షంగా స్థానిక సంస్థల ఎన్నికల బరిలో ఉన్న ఎంపీటీసీ అభ్యర్థులపై పడింది.ముమ్మరంగా ప్రచారాలు ప్రారంభించాల్సిన సమ యంలో అర్నబ్ తుఫాన్ కారణంగా ప్రచారాలు,సభలు,ర్యాలీలు నిర్వహిం చలేని పరిస్థితి ఏర్పడింది.మైకులు కట్టి, బైక్ ర్యాలీలు, రోడ్ షోలతో హోరెత్తిం చాల్సిన కీలక సమయంలో అభ్యర్థులు ఇళ్లకే పరిమితం కావాల్సి వచ్చింది. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి పోటీ బరిలో ఉన్న అభ్యర్థులు ముమ్మరంగా ప్రచారం చేస్తుండేవారు. తీరా పోలింగ్ తేదీ దగ్గరపడుతున్న వేళ అర్నబ్ తుపాను పంజా విసరడం తో ప్రచారం ఒక్కసారిగా నిలిచిపోయిం ది.ఈదురు గాలులు, ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా అభ్యర్థులు ఇళ్ల నుండి బయటకు రాలేకపోతున్నారు.స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా నామినేషన్ ప్రక్రియ, అభ్యర్థుల ఉపసంహరణ తదితర ప్రక్రియ పూర్తి కావడంతో పోటీ బరిలో ఉన్న తెలుగుదేశం,వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జనసేన పార్టీ అభ్యర్థులు ప్రచారా నికి సిద్ధమవుతున్న సమయంలో అర్నబ్ తుఫాన్ కారణంగా ప్రచారం చేయలేని పరిస్థితి ఏర్పడింది.ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో గ్రామాల్లో ప్రచారం చేసేందుకు తుఫాన్ వర్షాలు ఆటంకంగా ఏర్పడడంతో ఎంపీటీసీ మరియు జడ్పిటిసి ఎన్నికల్లో పోటీ బరిలో ఉన్న అభ్యర్థులు ఒకింత ఆందోళన చెందుతున్నారు.
రిపోర్టర్ : శశి భూషణరావు, గరుగుబిల్లి, పార్వతిపురం మన్యం.