జోరు వానలో కూటమి అభ్యర్థుల కోసం ఎమ్మెల్యే సతీమణి అనూష విస్తృత ప్రచారం
పార్వతీపురం, సూర్య : మున్సిపల్ ఎన్నికలలో కూటమి అభ్యర్థుల విజయం కోసం ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలను సైతం లెక్కచేయకుండా, చైర్ పర్సన్ అభ్యర్థి బెలగాం కరుణతో కలిసి పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర సతీమణి అనూష పట్టణంలోని పలు వార్డులలో ప్రచారం నిర్వహించారు. బుధవారం 1వ వార్డు బీజేపీ అభ్యర్థి వారి వలిరెడ్డి పార్వతి, 19వ వార్డు అభ్యర్థి జొన్నాడ శ్రీదేవితో కలిసి ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, గత ఐదేళ్లుగా నిరంకుశంగా పరిపాలించిన వైసీపీకి ఓటుతో బుద్ధి చెప్పి, ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేసే కూటమి అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు.
రిపోర్టర్ : ఎస్ఎస్ నాయుడు, పార్వతిపురం మన్యం.