32వ వార్డులో ఫ్యాన్ హోరు - గోల్డ్ ఇస్మాయిల్ కు బ్రహ్మరథం పడుతున్న ప్రజలు
రాయదుర్గం టౌన్ మేజర్ న్యూస్ : రాయదుర్గం పట్టణంలోని 32వ వార్డులో వైఎస్సార్సీపీ కౌన్సిలర్ అభ్యర్థి గోల్డ్ ఇస్మాయిల్ ఎన్నికల ప్రచారం జోరుగా నిర్వహించారు,వార్డులోని ప్రతి వీధిలో ఇంటింటికి తిరుగుతూ గత వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో జరిగిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులను ప్రజలకు వివరించారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని, మళ్లీ జగనన్న ప్రభుత్వం వస్తేనే అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందని తెలిపారు,వార్డులోని సమస్యల పరిష్కారానికి తాను ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని, ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి తనను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. ప్రచారానికి వార్డు ప్రజల నుండి అపూర్వ స్పందన లభించింది,ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, వార్డు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.