BREAKING
వైద్య సేవలకు అంతరాయం లేకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి కందుకూరు మండల ఓబీసీ మోర్చా అధ్యక్షుడిగా అంబటి కృష్ణ ఒంగోలు నగర మేయర్ గా శ్రీమతి నల్లమల్లి శ్రీ శిల్ప ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలి ఓట్ల వేటకు"అర్నబ్ "దెబ్బ..బ్రేక్ పడిన అభ్యర్థుల ప్రచారం! * స్తంభించిన స్థానిక సంస్థల ప్రచార పర్వం * అల్పాహార పథకంతో విద్యార్థుల ఆదర్శ శాతం పెరుగుదల మక్కువ.. ఎవరికి ఎక్కువ కాశీలో నివాసం.. ఇల్లు కొంటే వచ్చేది కాదు, శివుడు అనుగ్రహిస్తేనే వస్తుందా? జడ్పిటిసి అభ్యర్థి మతల సౌజన్యను గెలిపించండి జోరు వానలో కూటమి అభ్యర్థుల కోసం ఎమ్మెల్యే సతీమణి అనూష విస్తృత ప్రచారం భర్త డైరెక్షన్‌లో బోల్డ్ సీన్లలో నటించడంపై స్పందించిన నటి జ్యోతి పూర్వజ్.. కల్లర్ మూవీ విశేషాలు కూటమి అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా పనిచేయాలి కరువు జాబితాలో నవాబుపేటకు చోటేది? రైల్వే లెవల్ క్రాసింగ్ మరమ్మతులు ఆస్కార్ బరిలో నిలిచిన గోంధాల్.. తెలుగులోనూ గ్రాండ్‌గా విడుదల కానున్న ప్రసిద్ధ సైకలాజికల్ థ్రిల్లర్ నారాయణరావుపేట పంచాయతీలో నిధుల దుర్వినియోగంపై రేపు విచారణ.

సూర్య న్యూస్ కథనానికి స్పందన... పేదల ఇళ్ల పోరాటానికి స్పందించిన అధికారులు

Select Suryaa Now
సూర్య న్యూస్ కథనానికి స్పందన... పేదల ఇళ్ల పోరాటానికి స్పందించిన అధికారులు
సూర్య బెజ్జుర్ : నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని కోరుతూ బెజ్జూర్ మండలం ఉట్స్ సారంగపల్లి గ్రామపంచాయతీ ఎదుట పేద కుటుంబాలు చేపట్టిన ఆందోళనకు ఎట్టకేలకు అధికారులు స్పందించారు. మంగళవారం ఉదయం 9 గంటలకు ప్రారంభమైన నిరసనపై సుమారు 26 గంటల తర్వాత అధికారులు స్పందించడం చర్చనీయాంశంగా మారింది. సూర్య దినపత్రికల్లో ప్రచురితమైన కథనాల నేపథ్యంలో హౌసింగ్ ఏఈ సాయికుమార్ బాధితుల వద్దకు వచ్చి వారి సమస్యలను పరిశీలించారు.గ్రామంలో ముగ్గురు కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు కాలేదని, జాబితాలో అర్హులైన పేదలకు అన్యాయం జరిగిందని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. నిరుపేదలను పక్కనపెట్టి ఆర్థికంగా స్థితిమంతులైనవారికి, ఉద్యోగాలు ఉన్నవారికి, రాజకీయ నాయకుల అనుచరులకు ఇళ్లు కేటాయిస్తున్నారంటూ అధికారులను నిలదీశారు.
- ప్రతిపాదిత జాబితానే.. తుది జాబితా కాదు: హౌసింగ్ ఏఈ
బాధితుల ఆందోళనపై స్పందించిన హౌసింగ్ ఏఈ సాయికుమార్ మాట్లాడుతూ, ప్రస్తుతం వచ్చిన జాబితా ప్రతిపాదిత జాబితా మాత్రమేనని, అదే తుది జాబితా కాదని స్పష్టం చేశారు. అధికారులు క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహిస్తూ అర్హులు, అనర్హులను గుర్తించే ప్రక్రియ చేపడుతున్నారని, అన్నారు.ఎంపీడిఓ ఆఫీస్ కు సోమవారం రావాలని ఉన్నత అధికారుల ద్రుష్టి కి తీసుకోవెళ్లి న్యాయం చేస్తానని బరోసా తో ఆందోళన, నిరసన విరమించారు. న్యాయం జరుగని పక్షంలో మళ్ళీ ఇందిరమ్మ ఇండ్ల కోసం పోరాడుతా మని, అనర్హులను తొలగించి, ఇప్ప మౌనిక, సెగ్గం సులోచన, దుర్గం సునీత.బాధితులకు న్యాయం చేయాలని కోరారు..