ఇచ్చిన హామీలకే దిక్కులేదు..మళ్ళీ కొత్త హామిలా మాజీ మేయర్ వసీం
అనంతపురం బ్యూరో మేజర్ న్యూస్ : గత సార్వత్రిక ఎన్నికల సమయంలో ఓట్ల కోసం కూటమి నేతలు హామీలకే దిక్కులేదని మళ్ళీ కొత్తగా స్థానిక సంస్థల ఎన్నికల కోసం హామిలు ఇస్తుండటాన్ని చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని మాజీ మేయర్ మహమ్మద్ వసీం పేర్కొన్నారు.నగర పాలక సంస్థ ఎన్నికల ప్రచారంలో భాగంగా 35 ,53వ డివిజన్ లలో మాజీ మేయర్ మహమ్మద్ వసీం వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థులు కమల్ భూషణ్,రహమతుల్లా లతోపాటు మేయర్ అభ్యర్థి చిట్లూరు రమేష్ లను మద్దతుగా ప్రచారం నిర్వహించి వైసీపీ అభ్యర్థులను గెలిపించాలని ఓటర్లను కోరారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు గడుస్తున్నా గత ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను అమలు చేయకుండా ప్రజలను వంచించారన్నారు.మరోమారు ప్రజలను వంచించేంచేందు నేడు నగర పాలక సంస్థ ఎన్నికల్లో ఆచరణ సాధ్యం కాని హామీలు గుప్పిస్తున్నా కూటమి నేతలను ప్రజలు నమ్మే పరిస్థితి లేకపోవడంతో ఓటమి భయం వారిలో మొదలు అయ్యిందన్నారు.దీనితో సామాన్య స్థానిక ఎన్నికలకు బీజేపీ నేతలు రాష్ట్ర,జాతీయ నేతలను ప్రచారానికి పిలిపిస్తున్నారన్నారు. బీజేపీ నేతలు ఎన్ని జిమ్మిక్కులు చేసినా నగర ప్రజలు వారిని విశ్వసించరని,వైసీపీ మేయర్ అభ్యర్థి చిట్లూరు రమేష్ తోపాటు అన్ని స్థానాలలో వైసీపీ అభ్యర్థులను గెలిపించేందుకు సిద్ధమయ్యారని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో వైసీపీ ఎస్సి సెల్ జిల్లా అధ్యక్షులు మల్లెమీద నరసింహులు, విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షులు చంద్రశేఖర్ యాదవ్ లతో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.
రిపోర్టర్ మొయినుద్దీన్, అనంతపురం బ్యూరో.