BREAKING
ఒంగోలు నగర మేయర్ గా శ్రీమతి నల్లమల్లి శ్రీ శిల్ప ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలి ఓట్ల వేటకు"అర్నబ్ "దెబ్బ..బ్రేక్ పడిన అభ్యర్థుల ప్రచారం! * స్తంభించిన స్థానిక సంస్థల ప్రచార పర్వం * అల్పాహార పథకంతో విద్యార్థుల ఆదర్శ శాతం పెరుగుదల మక్కువ.. ఎవరికి ఎక్కువ కాశీలో నివాసం.. ఇల్లు కొంటే వచ్చేది కాదు, శివుడు అనుగ్రహిస్తేనే వస్తుందా? జడ్పిటిసి అభ్యర్థి మతల సౌజన్యను గెలిపించండి జోరు వానలో కూటమి అభ్యర్థుల కోసం ఎమ్మెల్యే సతీమణి అనూష విస్తృత ప్రచారం భర్త డైరెక్షన్‌లో బోల్డ్ సీన్లలో నటించడంపై స్పందించిన నటి జ్యోతి పూర్వజ్.. కల్లర్ మూవీ విశేషాలు కూటమి అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా పనిచేయాలి కరువు జాబితాలో నవాబుపేటకు చోటేది? రైల్వే లెవల్ క్రాసింగ్ మరమ్మతులు ఆస్కార్ బరిలో నిలిచిన గోంధాల్.. తెలుగులోనూ గ్రాండ్‌గా విడుదల కానున్న ప్రసిద్ధ సైకలాజికల్ థ్రిల్లర్ నారాయణరావుపేట పంచాయతీలో నిధుల దుర్వినియోగంపై రేపు విచారణ. తీవ్ర తుఫానుకు తల్లడిల్లుతున్న వృద్ధ దంపతులు.. ఎగిరిపోయిన ఇంటి పైకప్పు! 32వ వార్డులో ఫ్యాన్ హోరు - గోల్డ్ ఇస్మాయిల్ కు బ్రహ్మరథం పడుతున్న ప్రజలు

న్యూ నలంద పాఠశాలలో ఈ-వేస్ట్ సేకరణ డ్రైవ్

Select Suryaa Now
న్యూ నలంద పాఠశాలలో ఈ-వేస్ట్ సేకరణ డ్రైవ్
సూర్య ఉట్నూర్ : పర్యావరణ పరిరక్షణ, ఎలక్ట్రానిక్ వ్యర్థాల సక్రమ నిర్వహణపై విద్యార్థులకు అవగాహన కల్పించే లక్ష్యంతో ఉట్నూర్ మండలంలోని లింగోజి తండా ఎక్స్‌రోడ్‌లో ఉన్న న్యూ నలంద ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో బుధువారం ఈ-వేస్ట్ సేకరణ డ్రైవ్ నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో భాగంగా ఉపయోగించని మొబైల్ ఫోన్లు, ఛార్జర్లు, పాడైన ఎలక్ట్రానిక్ పరికరాలు, బ్యాటరీలు తదితర ఈ-వ్యర్థాలను సేకరించడం ద్వారా వాటిని బాధ్యతాయుతంగా పారవేయాల్సిన అవసరాన్ని వివరించారు. ఈ-వ్యర్థాలను సాధారణ చెత్తలో కలపకుండా, వాటిని ప్రత్యేకంగా సేకరించి అధీకృత రీసైక్లింగ్ కేంద్రాలకు అందించాలని సూచించారు. కరెస్పాండంట్ జాదవ్ వసంత్ రావు మాట్లాడుతూ..ఈ-వ్యర్థాల వల్ల పర్యావరణానికి కలిగే నష్టాలు, వాటి నిర్వహణలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, ఇలాంటి కార్యక్రమాలను తమ ఇళ్లలోనూ ప్రోత్సహించాలని సూచించారు.ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థుల్లో పర్యావరణ స్పృహ పెంపొందించడంతో పాటు, బాధ్యతాయుతమైన వ్యర్థాల నిర్వహణపై అవగాహన కల్పించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.