కౌసర్ విజయానికి కూటమి బాటలు.. 32వ డివిజన్లో బిజెపి జనసేన టిడిపి నాయకుల విస్తృత ప్రచారం
అనంతపురం ప్రతినిధి మేజర్ న్యూస్ :- అనంతపురం నగరపాలక సంస్థ 32 వ డివిజన్ కూటమి అభ్యర్థిగా బరిలో నిలిచిన కౌసర్ విజయానికి కూటమి పార్టీల నాయకులు బాటలు వేస్తున్నారు. 32వ డివిజన్లో కౌసర్ ను గెలిపించుకునేందుకు తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ ల నాయకులు కార్యకర్తలు వీర మహిళలు పెద్ద సంఖ్యలో కలియ తిరుగుతూ.. ఇంటింటికి వెళ్లి విస్తృత ప్రచారం నిర్వహించారు. ప్రజాసేవ చేయాలన్న సంకల్పంతో రాజకీయాల్లోకి వచ్చిన కౌసర్ ను ఆదరించి ఆశీర్వదించి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. స్థానికంగా ప్రజలకు అందుబాటులో ఉండి మీ సమస్యల పరిష్కారమే పరమావధిగా పనిచేస్తామని ఈ సందర్భంగా కౌసర్ డివిజన్ ప్రజలకు హామీ ఇచ్చారు. మేయర్ అభ్యర్థి అజేష్ యాదవ్ కమలం గుర్తుకు, కార్పొరేటర్ అభ్యర్థి కౌసర్ గాజు గ్లాస్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కూటమి పార్టీల నాయకులు 32 వ డివిజన్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.