BREAKING
32వ వార్డులో ఫ్యాన్ హోరు - గోల్డ్ ఇస్మాయిల్ కు బ్రహ్మరథం పడుతున్న ప్రజలు బీజేపీ కందుకూరు మండల ఓబీసీ మోర్చా అధ్యక్షుడిగా అంబటి కృష్ణ నీళ్లలో సాహసించి విద్యుత్‌ సరఫరాను పునరుద్ధరించిన సిబ్బంది ఇచ్చిన హామీలకే దిక్కులేదు..మళ్ళీ కొత్త హామిలా మాజీ మేయర్ వసీం మంచాల మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలి ప్రాణాలకు తెగించి నీళ్లలో దిగి విద్యుత్‌ సరఫరా పునరుద్ధరణ: డ్రైవర్లకు ఉచిత కంటి పరీక్షలు.. కళ్లద్దాల పంపిణీ ఇజ్రాయెల్ ఎన్నికల్లో ఉత్కంఠ.. నెతన్యాహు మళ్లీ అధికారంలోకి వస్తారా? కుటుంబంతో కలిసి నవ్వుతూ ఎంజాయ్ చేసే సినిమా ఇది.. దొంగ నా కొడుకు సాంగ్ లాంచ్ ఈవెంట్‌లో హీరో మౌళి కౌసర్ విజయానికి కూటమి బాటలు.. 32వ డివిజన్లో బిజెపి జనసేన టిడిపి నాయకుల విస్తృత ప్రచారం మోదీపై వ్యక్తిగత విమర్శలు సరికాదుః ఖర్గే వ్యాఖ్యలను ఖండించిన బీసీ సంఘాలు 47 ఏళ్ల తర్వాత కలవనున్న దిగ్గజాలు.. నెట్‌ఫ్లిక్స్ మెగావర్స్ షోలో చిరంజీవి, కమల్ హాసన్ సందడి మార్పు దిశగా ప్రపంచ దేశాలు న్యూ నలంద పాఠశాలలో ఈ-వేస్ట్ సేకరణ డ్రైవ్ *కోహెడ మండలంపై మంత్రి పొన్నం ప్రభాకర్‌కు సవతి తల్లి ప్రేమ ఎందుకు రైతుల కష్టాలు ప్రభుత్వానికి కనిపించడం లేదా*

యువత పొగాకు ఉత్పత్తుల కు దూరంగా ఉండాలి -ప్రోగ్రాం అధికారి డాక్టర్ ప్రదీప్ కుమార్

Select Suryaa Now
యువత పొగాకు ఉత్పత్తుల కు దూరంగా ఉండాలి  -ప్రోగ్రాం అధికారి డాక్టర్ ప్రదీప్ కుమార్

యువత పొగాకు ఉత్పత్తుల వ్యసనాలకు దూరంగా ఉండి ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలని ప్రోగ్రాం అధికారి డాక్టర్ ప్రదీప్ కుమార్ తెలిపారు.  బుధవారం  జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ ఆర్ట్స్ కళాశాలలో "యూత్ ఫ్రీ టొబాకో క్యాంపెయిన్ 4.0 " కార్యక్రమాన్ని  ప్రారంభించారు. ఈ సందర్భంగా  మాట్లాడుతూ   అక్టోబర్ 28  నుంచి డిసెంబర్ 27 వరకు 60 రోజులు యువత పొగాకు ఉత్పత్తుల వినియోగానికి దూరంగా ఉండాలని , విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. పొగాకుఉత్పత్తులను వినియోగించడం వల్ల  నికోటిన్ ఇతర హానికరమైన రసాయనాలు మానవ శరీరంలోని గుండె, రక్తనాళాల పై హానికర ప్రభావం చూపుతాయని , గుండె జబ్బులు, అధిక రక్తపోటు, పక్షవాతము తదితర అనారోగ్య సమస్యలు , ఊపిరితిత్తుల పనితీరుపై తీవ్ర ప్రభావం చూపుతుందని, తరచుగా నిమోనియా , సి ఓ పి డి, తదితర అనారోగ్య సమస్యలు కలుగుతాయని తెలిపారు. నోరు ,ఆహారవాహిక, జీర్ణాశయం, మూత్రపిండాలు క్యాన్సర్ కు గురవుతాయని ముఖ్యంగా ప్రత్యుత్పత్తి వ్యవస్థ పై తీవ్ర తీవ్ర ప్రభావం చూపి సంతానలేమి సమస్యలకు గురవుతారన్నారు. వైద్యాధికారి డాక్టర్ సృజన మాట్లాడుతూ కోట్పా 2003 చట్టం ప్రకారము  18 సంవత్సరాల లోపు పిల్లలకు పొగాకు ఉత్పత్తులు అమ్మ రాదని, విద్యాసంస్థలకు వంద అడుగుల దూరంలో పొగాకు ఉత్పత్తులు అమ్మకూడదు, బహిరంగ ప్రదేశాలైన బస్టాండు ,ప్రభుత్వ కార్యాలయాలు తదితర ప్రదేశాలలో పొగ త్రాగరాదు, పొగాకు ఉత్పత్తులను వినియోగించమని ఎలాంటి ప్రకటనలు చేయవద్దని తెలిపారు. తదనంతరం విద్యార్థులచే ప్రతిజ్ఞ చేయించారు.కార్యక్రమంలో 
ప్రోగ్రాం అధికారి డాక్టర్ కృష్ణమోహన్, పిపి యూనిట్ వైద్య అధికారి డాక్టర్ సృజన, కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ గీతాంజలి, ఎన్ సిడి జిల్లా కోఆర్డినేటర్స్ విజయకుమార్, మల్లేష్ విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.
పి. వినయ్ కుమార్,  నాగర్‌కర్నూల్ క్రైమ్, సూర్య న్యూస్