BREAKING
నారాయణరావుపేట పంచాయతీలో నిధుల దుర్వినియోగంపై రేపు విచారణ. తీవ్ర తుఫానుకు తల్లడిల్లుతున్న వృద్ధ దంపతులు.. ఎగిరిపోయిన ఇంటి పైకప్పు! 32వ వార్డులో ఫ్యాన్ హోరు - గోల్డ్ ఇస్మాయిల్ కు బ్రహ్మరథం పడుతున్న ప్రజలు బీజేపీ కందుకూరు మండల ఓబీసీ మోర్చా అధ్యక్షుడిగా అంబటి కృష్ణ నీళ్లలో సాహసించి విద్యుత్‌ సరఫరాను పునరుద్ధరించిన సిబ్బంది ఇచ్చిన హామీలకే దిక్కులేదు..మళ్ళీ కొత్త హామిలా మాజీ మేయర్ వసీం మంచాల మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలి ప్రాణాలకు తెగించి నీళ్లలో దిగి విద్యుత్‌ సరఫరా పునరుద్ధరణ: డ్రైవర్లకు ఉచిత కంటి పరీక్షలు.. కళ్లద్దాల పంపిణీ ఇజ్రాయెల్ ఎన్నికల్లో ఉత్కంఠ.. నెతన్యాహు మళ్లీ అధికారంలోకి వస్తారా? కుటుంబంతో కలిసి నవ్వుతూ ఎంజాయ్ చేసే సినిమా ఇది.. దొంగ నా కొడుకు సాంగ్ లాంచ్ ఈవెంట్‌లో హీరో మౌళి కౌసర్ విజయానికి కూటమి బాటలు.. 32వ డివిజన్లో బిజెపి జనసేన టిడిపి నాయకుల విస్తృత ప్రచారం మోదీపై వ్యక్తిగత విమర్శలు సరికాదుః ఖర్గే వ్యాఖ్యలను ఖండించిన బీసీ సంఘాలు 47 ఏళ్ల తర్వాత కలవనున్న దిగ్గజాలు.. నెట్‌ఫ్లిక్స్ మెగావర్స్ షోలో చిరంజీవి, కమల్ హాసన్ సందడి మార్పు దిశగా ప్రపంచ దేశాలు

కందుకూరు మండల వార్డు మెంబర్ల ఫోరం అధ్యక్షుడిగా తాళ్ల కార్తిక్ ఏకగ్రీవ ఎన్నిక

Select Suryaa Now
కందుకూరు మండల వార్డు మెంబర్ల ఫోరం అధ్యక్షుడిగా తాళ్ల కార్తిక్ ఏకగ్రీవ ఎన్నిక

కందుకూరు: తెలంగాణ రాష్ట్ర వార్డు మెంబర్ల ఫోరం రాష్ట్ర వ్యవస్థాపకుడు నాగబెల్లి జ్యోతి మహేష్ ఆదేశాల మేరకు కందుకూరు మండల అధ్యక్షుడిగా తాళ్ల కార్తిక్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వర్కింగ్ ప్రెసిడెంట్‌గా విజయలక్ష్మి కృష్ణ, గౌరవ అధ్యక్షుడిగా సౌడపు శేఖర్ గౌడ్ ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమానికి రంగారెడ్డి జిల్లా ఇన్‌చార్జ్ గ్యార సురేష్, కో-ఇన్‌చార్జ్ దన్నె మల్లేష్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా గ్యార సురేష్ మాట్లాడుతూ.... వార్డు సభ్యుల హక్కుల సాధనకు పార్టీలకతీతంగా ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. గ్రామాభివృద్ధి పనుల శిలాఫలకాలపై సంబంధిత వార్డు సభ్యుల పేర్లు ఉండాలని, వారికి తగిన గుర్తింపు, అధికారాలు కల్పించాలని కోరారు. వార్డు సభ్యులు, వారి కుటుంబాలకు ప్రమాద బీమా, ఆరోగ్య బీమా సౌకర్యాలు కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.నూతన అధ్యక్షుడు తాళ్ల కార్తిక్ మాట్లాడుతూ.... మండలంలోని అన్ని గ్రామాల వార్డు సభ్యులను సమన్వయం చేసుకుంటూ వారి సమస్యల పరిష్కారం, హక్కుల సాధన, గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. కార్యక్రమంలో ఫోరం నాయకులు, వివిధ గ్రామాల వార్డు సభ్యులు పాల్గొన్నారు.


టి. శ్రీనివాస్, మేజర్ న్యూస్