శ్రీ చైతన్య విద్యార్థులకు స్కాలర్షిప్... శ్రీరామ్ ఫైనాన్స్ సంస్థ ద్వారా ఎంపిక
వేంపల్లె మేజర్ న్యూస్:
స్థానిక శ్రీచైతన్య ఉన్నత పాఠశాలకు చెందిన విధ్యార్థులకు స్కాలర్షిప్ కింద ఎంపికైనట్లు కరస్పాండెంట్ బండ్రెడ్డి చక్రపాణి రెడ్డి వెల్లడించారు. శ్రీరామ్ ఫైనాన్స్ సంస్థ అందిస్తున్న 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి స్కాలర్షిప్ పథకానికి ఐదు మంది విద్యార్థులు ఎంపికయ్యారు. విద్యా భ్యాసాన్ని ప్రోత్సాహించే లక్ష్యంతో ఆ పథకానికి అర్హత సాదించడం పట్ల పాఠశాల యాజమాన్యం హర్షం వ్యక్తం చేశారు. 8-10 తరగతుల మధ్య చదువుతున్న విద్యార్థులకు ఏడాదికి రూ. 4 వేలు చొప్పున స్కాలర్షిప్ అందుతుంది. రవాణా రంగంలో పనిచేస్తూ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉన్న వారి పిల్లలకు విద్యాభివృద్ధిలో భాగంగా ఆర్థిక ప్రోత్సాహం అందించడమే ఈ పథకం ప్రధాన ఉద్దేశం. శ్రీరామ్ ఫైనాన్స్ సంస్థ సీనియర్ బిజినెస్ మేనేజర్ హుస్సేన్ మాట్లాడుతూ విధ్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించి మంచి భవిష్యత్ ని ఏర్పరుచుటకు ఈ పథకం ఎంతో దోహద పడుతుందన్నారు. అలాగే పాఠశాల కరస్పాండెంట్ మాట్లాడుతూ విధ్యార్థుల ప్రతిభను ప్రోత్సాహిస్తూ, వీరి చదువుకు తోడ్పాటు అందించడం అభినందనీయం అన్నారు. స్కాలర్షిప్ కు ఎంపికైన విధ్యార్ధులను అభినందిస్తూ భవిష్యత్ లో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.
రిపోర్టర్: గండికోట షేక్ ఖదీర్,
వేంపల్లె, వైఎస్ఆర్ కడప జిల్లా.