ఏ. నారాయణపురం ఎంపీటీసీ 2 కూటమి అభ్యర్థిగా లాలు స్వామి రాయల్
అనంతపురం ప్రతినిధి మేజర్ న్యూస్:- అనంతపురం రూరల్ మండలం ఏ. నారాయణపురం ఎంపీటీసీ 2 కూటమి అభ్యర్థిగా లాలు స్వామి రాయల్ బరిలో నిలిచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రెండున్నర సంవత్సరాల కూటమి ప్రభుత్వ పాలనలో గ్రామీణ ప్రాంతాలు అభివృద్ధి బాట పట్టాయి అన్నారు. తమ అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గ్రామాల అభివృద్ధి కోసం చేస్తున్న కృషి తమను అఖండ మెజారిటీతో గెలిపిస్తుందని లాలు స్వామి రాయల్ ధీమా వ్యక్తం చేశారు. ఏ. నారాయణపురం ఎంపీటీసీ 2 పరిధిలో నెలకొన్న సమస్యల పరిష్కారమే పరమావధిగా ప్రజలకు సేవలందిస్తానని, తనను ఆశీర్వదించి గెలిపించాలని లాలు స్వామి విజ్ఞప్తి చేశారు.
మల్లికార్జున నేటి దినపత్రిక సూర్య స్టాఫ్ రిపోర్టర్..