ఎస్.వి. కళాశాలలో ఘనంగా వాణిజ్యోత్సవం–2కె26.. విద్యార్థులు నైపుణ్యాభివృద్ధిపై దృష్టి సారించాలి..
అనంతపురం విద్య మేజర్ న్యూస్ :-స్థానిక ఎస్.వి. డిగ్రీ అండ్ పీజీ కళాశాలలో కామర్స్ అండ్ మేనేజ్‌మెంట్ విభాగం ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి వాణిజ్యోత్సవం–2కె 26 కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. కళాశాల చైర్మన్ డా. సి. సోమశేఖర రెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు విద్యా పరిజ్ఞానంతో పాటు విశ్లేషణాత్మక ఆలోచన, నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం, సమస్యల పరిష్కార నైపుణ్యాలను పెంపొందించుకోవాలని సూచించారు. కళాశాల ప్రిన్సిపాల్ డా. ఎన్.ఎ.వి. ప్రసాద్ మాట్లాడుతూ ఇటువంటి కార్యక్రమాలు విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి దోహదపడతాయని తెలిపారు. ముఖ్య అతిథి డా. ఎన్. జయప్రద మాట్లాడుతూ కమ్యూనికేషన్, సృజనాత్మక ఆలోచన, నాయకత్వ లక్షణాలు, డిజిటల్ పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. గౌరవ అతిథి డా. యు. ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ వ్యాపార రంగంలో వస్తున్న మార్పులపై అవగాహనతో పాటు ఆచరణాత్మక జ్ఞానాన్ని పెంచుకోవాలని పేర్కొన్నారు.ఈ సందర్భంగా నిర్వహించిన పవర్‌పాయింట్ ప్రజెంటేషన్, పోస్టర్ మేకింగ్, బిజినెస్ క్విజ్ పోటీల్లో వివిధ డిగ్రీ కళాశాలల విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు. కార్యక్రమంలో కళాశాల వైస్ చైర్మన్ సి. చక్రధర రెడ్డి, ఏఓ ఎ. శ్రీనాథ్, కన్వీనర్ యం. పోతలయ్య, కామర్స్ అండ్ మేనేజ్‌మెంట్ విభాగం అధ్యాపకులు, వివిధ కళాశాలల విద్యార్థులు పాల్గొన్నారు.
మల్లికార్జున నేటి దినపత్రిక సూర్య స్టాఫ్ రిపోర్టర్..