BREAKING
32వ వార్డులో ఫ్యాన్ హోరు - గోల్డ్ ఇస్మాయిల్ కు బ్రహ్మరథం పడుతున్న ప్రజలు బీజేపీ కందుకూరు మండల ఓబీసీ మోర్చా అధ్యక్షుడిగా అంబటి కృష్ణ నీళ్లలో సాహసించి విద్యుత్‌ సరఫరాను పునరుద్ధరించిన సిబ్బంది ఇచ్చిన హామీలకే దిక్కులేదు..మళ్ళీ కొత్త హామిలా మాజీ మేయర్ వసీం మంచాల మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలి ప్రాణాలకు తెగించి నీళ్లలో దిగి విద్యుత్‌ సరఫరా పునరుద్ధరణ: డ్రైవర్లకు ఉచిత కంటి పరీక్షలు.. కళ్లద్దాల పంపిణీ ఇజ్రాయెల్ ఎన్నికల్లో ఉత్కంఠ.. నెతన్యాహు మళ్లీ అధికారంలోకి వస్తారా? కుటుంబంతో కలిసి నవ్వుతూ ఎంజాయ్ చేసే సినిమా ఇది.. దొంగ నా కొడుకు సాంగ్ లాంచ్ ఈవెంట్‌లో హీరో మౌళి కౌసర్ విజయానికి కూటమి బాటలు.. 32వ డివిజన్లో బిజెపి జనసేన టిడిపి నాయకుల విస్తృత ప్రచారం మోదీపై వ్యక్తిగత విమర్శలు సరికాదుః ఖర్గే వ్యాఖ్యలను ఖండించిన బీసీ సంఘాలు 47 ఏళ్ల తర్వాత కలవనున్న దిగ్గజాలు.. నెట్‌ఫ్లిక్స్ మెగావర్స్ షోలో చిరంజీవి, కమల్ హాసన్ సందడి మార్పు దిశగా ప్రపంచ దేశాలు న్యూ నలంద పాఠశాలలో ఈ-వేస్ట్ సేకరణ డ్రైవ్ *కోహెడ మండలంపై మంత్రి పొన్నం ప్రభాకర్‌కు సవతి తల్లి ప్రేమ ఎందుకు రైతుల కష్టాలు ప్రభుత్వానికి కనిపించడం లేదా*

సోలార్ ప్యానెళ్ల ఏర్పాటులో కొండారెడ్డిపల్లి ఆదర్శం

Select Suryaa Now
సోలార్ ప్యానెళ్ల ఏర్పాటులో కొండారెడ్డిపల్లి ఆదర్శం

* ప్రతి ఇంటికీ సౌర విద్యుత్‌.. 100 శాతం సోలార్‌ గ్రామంగా తీర్చిదిద్దాలి
* జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్
 బల్మూరు సూర్య న్యూస్ :జిల్లాలోని బల్మూర్ మండలం కొండారెడ్డిపల్లి గ్రామాన్ని 100 శాతం సోలార్‌ గ్రామంగా అభివృద్ధి చేయాలని జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ అధికారులను ఆదేశించారు. ప్రతి ఇంటికీ సోలార్‌ ప్యానెళ్ల ద్వారా సౌర విద్యుత్‌ సదుపాయం కల్పించే చర్యలు అభినందనీయమని, ఈ కార్యక్రమం ఇతర గ్రామాలకు ఆదర్శంగా నిలుస్తుందని పేర్కొన్నారు.బుధవారం అచ్చంపేట సబ్‌ కలెక్టర్ సలోని చాబ్రాతో కలిసి కొండారెడ్డిపల్లిలో కలెక్టర్ పర్యటించారు. గ్రామంలోని ఇళ్లపై ఏర్పాటు చేసిన సోలార్‌ ప్యానెళ్లను పరిశీలించి, పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఇప్పటివరకు సుమారు 101 ఇళ్లపై సోలార్‌ ప్యానెళ్లు ఏర్పాటు చేసినట్లు అధికారులు వివరించారు. మిగిలిన ఇళ్లపై కూడా ప్యానెళ్ల ఏర్పాటు పనులను వేగవంతం చేసి, నూతనంగా నిర్మిస్తున్న ఇళ్లకు సైతం సౌర విద్యుత్‌ కనెక్షన్లు కల్పించాలని కలెక్టర్‌ సూచించారు.
అనంతరం గ్రామంలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇళ్లను పరిశీలించి, లబ్ధిదారులకు అందిన బిల్లులు, పెండింగ్‌ బిల్లుల వివరాలను తెలుసుకున్నారు. నిర్మాణాల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని, లబ్ధిదారులకు ఇబ్బందులు కలగకుండా పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు.
గ్రామంలోని అంగన్‌వాడీ కేంద్రాన్ని సందర్శించిన కలెక్టర్‌ చిన్నారులకు అందిస్తున్న పౌష్టికాహారం, కేంద్రం నిర్వహణను పరిశీలించారు. పిల్లల ఆరోగ్యం, ఎదుగుదలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సిబ్బందికి సూచించారు. చిన్నారులతో ఆప్యాయంగా ముచ్చటించారు.
అలాగే రూ.20 లక్షల అంచనా వ్యయంతో నిర్మిస్తున్న గ్రామ పంచాయతీ భవన పనులను పరిశీలించారు. ఇప్పటివరకు 70 శాతం పనులు పూర్తయ్యాయని, మరో రెండు నెలల్లో భవనాన్ని పూర్తి చేస్తామని అధికారులు తెలిపారు. నాణ్యతతో కూడిన నిర్మాణ పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని కలెక్టర్‌ ఆదేశించారు.