BREAKING
32వ వార్డులో ఫ్యాన్ హోరు - గోల్డ్ ఇస్మాయిల్ కు బ్రహ్మరథం పడుతున్న ప్రజలు బీజేపీ కందుకూరు మండల ఓబీసీ మోర్చా అధ్యక్షుడిగా అంబటి కృష్ణ నీళ్లలో సాహసించి విద్యుత్‌ సరఫరాను పునరుద్ధరించిన సిబ్బంది ఇచ్చిన హామీలకే దిక్కులేదు..మళ్ళీ కొత్త హామిలా మాజీ మేయర్ వసీం మంచాల మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలి ప్రాణాలకు తెగించి నీళ్లలో దిగి విద్యుత్‌ సరఫరా పునరుద్ధరణ: డ్రైవర్లకు ఉచిత కంటి పరీక్షలు.. కళ్లద్దాల పంపిణీ ఇజ్రాయెల్ ఎన్నికల్లో ఉత్కంఠ.. నెతన్యాహు మళ్లీ అధికారంలోకి వస్తారా? కుటుంబంతో కలిసి నవ్వుతూ ఎంజాయ్ చేసే సినిమా ఇది.. దొంగ నా కొడుకు సాంగ్ లాంచ్ ఈవెంట్‌లో హీరో మౌళి కౌసర్ విజయానికి కూటమి బాటలు.. 32వ డివిజన్లో బిజెపి జనసేన టిడిపి నాయకుల విస్తృత ప్రచారం మోదీపై వ్యక్తిగత విమర్శలు సరికాదుః ఖర్గే వ్యాఖ్యలను ఖండించిన బీసీ సంఘాలు 47 ఏళ్ల తర్వాత కలవనున్న దిగ్గజాలు.. నెట్‌ఫ్లిక్స్ మెగావర్స్ షోలో చిరంజీవి, కమల్ హాసన్ సందడి మార్పు దిశగా ప్రపంచ దేశాలు న్యూ నలంద పాఠశాలలో ఈ-వేస్ట్ సేకరణ డ్రైవ్ *కోహెడ మండలంపై మంత్రి పొన్నం ప్రభాకర్‌కు సవతి తల్లి ప్రేమ ఎందుకు రైతుల కష్టాలు ప్రభుత్వానికి కనిపించడం లేదా*

ఉష్ణమండల వ్యాధుల నివారణకు ఉమ్మడి కృషి అవశ్యం: డాక్టర్ అహ్మద్

Select Suryaa Now
ఉష్ణమండల వ్యాధుల నివారణకు ఉమ్మడి కృషి అవశ్యం: డాక్టర్ అహ్మద్

పటాన్ చెరు ; నిర్లక్ష్యం చేయబడిన ఉష్ణమండల వ్యాధులను ఎదుర్కోవాలంటే శాస్త్రవేత్తలు, విధాన రూపకర్తలు, సామాజిక పరిశోధకులు కలిసి పనిచేయాలని గీతం స్కూల్ ఆఫ్ సైన్స్, జీవశాస్త్రాల విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఫర్హాన్ అహ్మద్ స్పష్టీకరించారు. హైదరాబాదులోని గీతం స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్ (జీఎస్ హెచ్ఎస్) యొక్క సంస్థాగత పరిశోధన కమిటీ, తన పరిశోధన సదస్సుల శ్రేణిలో భాగంగా ఎనిమిదవ సెమినార్ ను బుధవారం నిర్వహించింది. ‘వేడెక్కుతున్న ప్రపంచం కోసం వ్యాక్సిన్ ల రూపకల్పన: డెంగ్యూపై పోరాటంలో విజ్జానం, సమానత్వం, విధానం’ అనే శీర్షికన దీనిని ఏర్పాటు చేశారు.డాక్టర్ అహ్మద్, డెంగ్యూ వ్యాప్తిపై వాతావరణ మార్పులు, పర్యావరణ కారకాల ప్రభావాన్ని వివరిస్తూ, ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతున్న డెంగ్యూ ముప్పు గురించి చర్చించారు. వ్యాక్సిన్ ఆవిష్కర్తలుగా తమ ప్రయోగశాల ఈ సమస్యను ఎలా పరిష్కరించిందో ఆయన వివరించారు. ఈ పరిశోధన ఫలితాలు ప్రాథమిక, ప్రీ-క్లినికల్ దశలో ఉన్నప్పటికీ, ఈ రంగాన్ని వెనక్కి నెట్టిన భద్రత, సమర్థతకు సంబంధించిన రాజీలను, మరింత తెలివైన వ్యాక్సిన్ రూపకల్పన ద్వారా పరిష్కరించవచ్చని ఇవి చూపిస్తున్నాయన్నారు.పలువురు అధ్యాపకులు ఈ చర్చలో చురుకుగా పాల్గొని, పలు సందేహాలపై వివరణలు కోరడంతో పాటు డాక్టర్ అహ్మద్ పరిశోధనా నైపుణ్యాన్ని, స్పష్టమైన వివరణను ప్రశంసించారు.