BREAKING
నారాయణరావుపేట పంచాయతీలో నిధుల దుర్వినియోగంపై రేపు విచారణ. తీవ్ర తుఫానుకు తల్లడిల్లుతున్న వృద్ధ దంపతులు.. ఎగిరిపోయిన ఇంటి పైకప్పు! 32వ వార్డులో ఫ్యాన్ హోరు - గోల్డ్ ఇస్మాయిల్ కు బ్రహ్మరథం పడుతున్న ప్రజలు బీజేపీ కందుకూరు మండల ఓబీసీ మోర్చా అధ్యక్షుడిగా అంబటి కృష్ణ నీళ్లలో సాహసించి విద్యుత్‌ సరఫరాను పునరుద్ధరించిన సిబ్బంది ఇచ్చిన హామీలకే దిక్కులేదు..మళ్ళీ కొత్త హామిలా మాజీ మేయర్ వసీం మంచాల మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలి ప్రాణాలకు తెగించి నీళ్లలో దిగి విద్యుత్‌ సరఫరా పునరుద్ధరణ: డ్రైవర్లకు ఉచిత కంటి పరీక్షలు.. కళ్లద్దాల పంపిణీ ఇజ్రాయెల్ ఎన్నికల్లో ఉత్కంఠ.. నెతన్యాహు మళ్లీ అధికారంలోకి వస్తారా? కుటుంబంతో కలిసి నవ్వుతూ ఎంజాయ్ చేసే సినిమా ఇది.. దొంగ నా కొడుకు సాంగ్ లాంచ్ ఈవెంట్‌లో హీరో మౌళి కౌసర్ విజయానికి కూటమి బాటలు.. 32వ డివిజన్లో బిజెపి జనసేన టిడిపి నాయకుల విస్తృత ప్రచారం మోదీపై వ్యక్తిగత విమర్శలు సరికాదుః ఖర్గే వ్యాఖ్యలను ఖండించిన బీసీ సంఘాలు 47 ఏళ్ల తర్వాత కలవనున్న దిగ్గజాలు.. నెట్‌ఫ్లిక్స్ మెగావర్స్ షోలో చిరంజీవి, కమల్ హాసన్ సందడి మార్పు దిశగా ప్రపంచ దేశాలు

కరువు కష్టాలను పక్కదారి పట్టించేందుకే కాంగ్రెస్‌ డైవర్షన్‌ రాజకీయాలు : బిఆర్ఎస్ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్

Select Suryaa Now
కరువు కష్టాలను పక్కదారి పట్టించేందుకే కాంగ్రెస్‌ డైవర్షన్‌ రాజకీయాలు :  బిఆర్ఎస్ నేత  ఎర్రోళ్ల శ్రీనివాస్

 

సూర్య బ్యూరో ప్రతినిధి : రాష్ట్రంలో కరువు పరిస్థితులు, ఎండిపోతున్న పంటలు, నిరుద్యోగుల సమస్యలు, ఎన్నికల హామీల అమలులో వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రతిపక్షాలపై విమర్శలకు దిగుతోందని కార్పొరేషన్‌ మాజీ చైర్మన్‌ డాక్టర్‌ ఎర్రోళ్ల శ్రీనివాస్‌ ఆరోపించారు. ప్రజా సమస్యలపై సమాధానం చెప్పలేక కాంగ్రెస్‌ నేతలు వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారని ఆయన విమర్శించారు.కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే తొలి ఏడాదిలోనే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చి నిరుద్యోగులను మోసం చేసిందని అన్నారు. అశోక్‌నగర్‌లో నిరుద్యోగుల చుట్టూ, రైతుల వద్దకు తిరిగి హామీలిచ్చిన బల్మూరి వెంకట్‌, చామల కిరణ్‌, అద్దంకి దయాకర్‌ తదితర నేతలు పదవులు చేపట్టాక ప్రజా సమస్యలను పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఎస్‌ఎస్‌సీ, ఏఈఈ పరీక్షలు ఒకే రోజు నిర్వహించడంపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో 12 లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోయాయని, రైతులకు నష్టపరిహారం అందించడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. గోదావరి, కృష్ణా నదుల్లో నీరున్నా సాగునీటి ప్రాజెక్టుల ద్వారా పంటలకు నీరందించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని విమర్శించారు. రైతుల విద్యుత్‌ సమస్యలను పరిష్కరించడంతో పాటు ఎండిన పంటలకు పరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేశారు.

ఎన్నికల ముందు ఇచ్చిన ఆరు గ్యారెంటీల హామీలను అమలు చేయకుండా ప్రజలపై విద్యుత్‌ చార్జీల భారం మోపారని ఆరోపించారు. దళిత, గిరిజనుల సంక్షేమ పథకాలు, నిరుద్యోగులకు ఇచ్చిన హామీల అమలుపైనా ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని కోరారు.

ప్రజా సమస్యలపై దృష్టి సారించి, ఇచ్చిన హామీలను అమలు చేయాలని కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని డాక్టర్‌ ఎర్రోళ్ల శ్రీనివాస్‌ డిమాండ్‌ చేశారు.