BREAKING
ఉష్ణమండల వ్యాధుల నివారణకు ఉమ్మడి కృషి అవశ్యం: డాక్టర్ అహ్మద్ రాజ‌ధానిలో తాగు నీటి స‌మ‌స్య రాకూడ‌దు .. తాగు నీరు స‌ర‌ఫ‌రా, ఎస్టీపీలపై స‌మీక్ష‌లో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి సోలార్ ప్యానెళ్ల ఏర్పాటులో కొండారెడ్డిపల్లి ఆదర్శం దత్తత ప్రక్రియను వేగవంతం చేయాలి! రాష్ట్ర దత్తత సంస్థ కార్యక్రమ నిర్వహణాధికారి సునీత యువత పొగాకు ఉత్పత్తుల కు దూరంగా ఉండాలి -ప్రోగ్రాం అధికారి డాక్టర్ ప్రదీప్ కుమార్ త్రివిక్రమ్ డైలాగులపై శ్రీనిధి శెట్టి ఆసక్తికర వ్యాఖ్యలు.. ఆదర్శ కుటుంబం విశేషాలు మంజీర నదిలో తల్లి, ఇద్దరు చిన్నారుల మృతదేహాలు వెలికితీత: ఏడుపాయల వద్ద విషాద ఘటన.. బంధువుల రోదనలు శ్రీ చైతన్య విద్యార్థులకు స్కాలర్షిప్... శ్రీరామ్ ఫైనాన్స్ సంస్థ ద్వారా ఎంపిక కరువు కష్టాలను పక్కదారి పట్టించేందుకే కాంగ్రెస్‌ డైవర్షన్‌ రాజకీయాలు : బిఆర్ఎస్ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్ రైతులకు భరోసా.. సహకార సంఘాల వద్దే వడ్లు అమ్మాలి! కందుకూరు మండల వార్డు మెంబర్ల ఫోరం అధ్యక్షుడిగా తాళ్ల కార్తిక్ ఏకగ్రీవ ఎన్నిక టెలివిజన్ తెరపై మొదటిసారిగా మీరా రాజ్‌పుత్ సందడి.. ది గ్రేట్ ఇండియన్ కపిల్ షోలో షాహిద్ కపూర్, ఈశాన్ ఖట్టర్ ఉగ్రదాడిని అడ్డుకున్న భారత పైలట్‌కు యూఏఈ అత్యున్నత గౌరవం పెరిగిన ధరలకు అనుగుణంగా హాస్టల్ విద్యార్థులకు నూతన మెనూ అమలు చేయాలి ఇసోజిపేటలో వరి కొనుగోలు కేంద్రం ప్రారంభం

క్రీడల్లోనూ మందమర్రి మోడల్ స్కూల్ విద్యార్థిని సత్తా - రాష్ట్రస్థాయి ఫుట్‌బాల్ పోటీలకు జీ. అనూ అర్హత

Select Suryaa Now
క్రీడల్లోనూ మందమర్రి మోడల్ స్కూల్ విద్యార్థిని సత్తా - రాష్ట్రస్థాయి ఫుట్‌బాల్ పోటీలకు జీ. అనూ అర్హత
సూర్య, మందమర్రి : చదువుతోపాటు క్రీడల్లోనూ రాణిస్తూ మందమర్రి తెలంగాణ మోడల్ స్కూల్ విద్యార్థిని జీ. అనూ తన ప్రతిభను చాటుకుంది. జోనల్ స్థాయి ఫుట్‌బాల్ పోటీల్లో ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికై పలువురి ప్రశంసలు అందుకుంది. పాఠశాలలో పదో తరగతి చదువుతున్న అనూ.. అక్టోబర్ 26న నిర్వహించిన జోనల్ స్థాయి ఫుట్‌బాల్ పోటీల్లో ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొనేందుకు అర్హత సాధించింది. మెదక్‌లో జరగనున్న రాష్ట్రస్థాయి పోటీల్లో ఆమె తన ఆటతీరును ప్రదర్శించనుంది. విద్యార్థుల్లో దాగి ఉన్న క్రీడా నైపుణ్యాలను వెలికితీసేందుకు పాఠశాల స్థాయిలో ప్రోత్సాహం ఎంతో అవసరమని ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ సారా తస్నీమ్ అభిప్రాయపడ్డారు. రాష్ట్రస్థాయి పోటీల్లోనూ ఉత్తమ ప్రతిభ కనబరిచి విజయం సాధించాలని ఆకాంక్షించారు. అనూ సాధించిన విజయంపై పాఠశాల ప్రిన్సిపాల్ సారా తస్నీమ్, పీటీ ఉపాధ్యాయురాలు ఎం. చిన్నక్క హర్షం వ్యక్తం చేస్తూ ఆమెను అభినందించారు.