ఇసోజిపేటలో వరి కొనుగోలు కేంద్రం ప్రారంభం
పుల్కల్ ; మండల పరిధిలోని ఇసోజిపేట గ్రామంలో డిఆర్డిఏ అనుబంధ సంస్థ ఐకేపీ ఆధ్వర్యంలో నూతన వరి కొనుగోలు కేంద్రాన్ని గ్రామ సర్పంచ్ విజయేందర్ రెడ్డి, ఉపసర్పంచ్ రవికుమార్ ప్రారంభించారు.ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ, రైతులు పండించిన ధాన్యానికి గిట్టుబాటు ధర కల్పించి, వారి గ్రామంలోనే కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయడం ప్రభుత్వ ఉద్దేశమని తెలిపారు. రైతులు ఈ కేంద్రాన్ని సద్వినియోగం చేసుకొని, అధికారులకు సహకరించాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఏపీఎం చంద్రశేఖర్, సిసి చిరంజీవిలక్ష్మి, రామచంద్రారెడ్డి, కమ్మరి సదాశివుడు, మున్నూరు మాణిక్యం, మంగలీ బుచ్చయ్య, కిష్టయ్య చాకలి శంకర్, ప్రభు, రవి, కిరణ్, వార్డు సభ్యులు గొల్ల పద్మ, శివనోళ్ల విజయ్ కుమార్, .గణపతి, తలారి యాదగిరి, గ్రామ రైతులు తదితరులు పాల్గొన్నారు.