BREAKING
మంత్రి పొంగులేటికి వాకిటి శ్రీహరి శుభాకాంక్షలు షారుఖ్ ఖాన్ కింగ్ పోస్టర్‌పై ట్రోలింగ్.. రణ్‌వీర్ సింగ్ మూవీతో పోలికలు మలయాళ నటుడు నివిన్ పౌలీకి బిగ్ రిలీఫ్.. చీటింగ్ కేసును కొట్టివేసిన కేరళ హైకోర్టు ఉస్మానియా ఆస్పత్రి నిర్మాణ పనులు వేగవంతం చేయాలిః హైదరాబాద్ ఇంచార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ 50 ఏళ్ల మహిళగా వామికా గబ్బి.. గుర్తుపట్టలేనంతగా మేకోవర్! ఉష్ణమండల వ్యాధుల నివారణకు ఉమ్మడి కృషి అవశ్యం: డాక్టర్ అహ్మద్ రాజ‌ధానిలో తాగు నీటి స‌మ‌స్య రాకూడ‌దు .. తాగు నీరు స‌ర‌ఫ‌రా, ఎస్టీపీలపై స‌మీక్ష‌లో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి సోలార్ ప్యానెళ్ల ఏర్పాటులో కొండారెడ్డిపల్లి ఆదర్శం దత్తత ప్రక్రియను వేగవంతం చేయాలి! రాష్ట్ర దత్తత సంస్థ కార్యక్రమ నిర్వహణాధికారి సునీత యువత పొగాకు ఉత్పత్తుల కు దూరంగా ఉండాలి -ప్రోగ్రాం అధికారి డాక్టర్ ప్రదీప్ కుమార్ త్రివిక్రమ్ డైలాగులపై శ్రీనిధి శెట్టి ఆసక్తికర వ్యాఖ్యలు.. ఆదర్శ కుటుంబం విశేషాలు మంజీర నదిలో తల్లి, ఇద్దరు చిన్నారుల మృతదేహాలు వెలికితీత: ఏడుపాయల వద్ద విషాద ఘటన.. బంధువుల రోదనలు శ్రీ చైతన్య విద్యార్థులకు స్కాలర్షిప్... శ్రీరామ్ ఫైనాన్స్ సంస్థ ద్వారా ఎంపిక కరువు కష్టాలను పక్కదారి పట్టించేందుకే కాంగ్రెస్‌ డైవర్షన్‌ రాజకీయాలు : బిఆర్ఎస్ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్ రైతులకు భరోసా.. సహకార సంఘాల వద్దే వడ్లు అమ్మాలి!

అధికారుల కొరతతో అభివృద్ధికి ఆటంకం

Select Suryaa Now
అధికారుల కొరతతో అభివృద్ధికి ఆటంకం

సిద్దిపేట రూరల్,మేజర్ న్యూస్: మండలంలో ఇంచార్జీ అధికారుల పాలనకు స్వస్తి పలికి, ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే రెగ్యులర్ అధికారులతో భర్తీ చేయాలని మండల సర్పంచులు డిమాండ్ చేశారు.బుధవారం నారాయణరావుపేట మండల కేంద్రంలోని రైతు వేదికలో నిర్వహించిన మండల స్థాయి అభివృద్ధి సమీక్ష సమావేశాన్ని 11 గ్రామాల సర్పంచులుబహిష్కరించారు.అనంతరం మండల ప్రత్యేక అధికారి రాజారాంకు వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అధికారుల కొరతతో ప్రజా సమస్యలు పరిష్కారం కాకపోవడంతో పాటు అభివృద్ధి పనులు కూడా కుంటుపడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మండల పరిధిలోని వైద్య ఆరోగ్య శాఖ, పశుసంవర్ధక శాఖ, పోలీస్ స్టేషన్‌తో పాటు మరికొన్ని శాఖలు రెండు మండలాలైన చిన్నకోడూరు, సిద్దిపేట రూరల్ పరిధిలో కొనసాగుతుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఆయా శాఖలను వెంటనే విలీనం చేసి, మండలానికి పూర్తిస్థాయి అధికారులు, సిబ్బందిని నియమించాలని కోరారు.హౌసింగ్ ఏఈ ఇంచార్జీగా ఉండటంతో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఇబ్బందులు తప్పడం లేదని పేర్కొన్నారు. రెవెన్యూ సర్వేయర్ లేకపోవడంతో రైతులు భూ సమస్యల పరిష్కారం కోసం కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.ఇంచార్జీ అధికారులతో పాలన సాగిస్తే ప్రజా సమస్యలు ఎలా పరిష్కారమవుతాయని సర్పంచ్ లు ప్రశ్నించారు. మండలానికి పూర్తిస్థాయి అధికారులు లేకుండా అభివృద్ధి సమీక్షలు నిర్వహించడం వల్ల ప్రయోజనం ఏమిటనినిలదీశారు.ఇంచార్జీలతో కాలం వెళ్లదీస్తూ ప్రజా సమస్యలను గాలికి వదిలేయడం ఎంతవరకు సమంజసమని మండిపడ్డారు.గ్రామాల్లో సమస్యలు పేరుకుపోతుంటే సమీక్ష సమావేశాలు నిర్వహించడం వల్ల ప్రయోజనం ఏమిటని ప్రశ్నించారు. ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సిన అధికారులు అందుబాటులో లేకపోవడం పాలనపై తీవ్ర ప్రభావం చూపుతోందని పేర్కొన్నారు.ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి ఖాళీ పోస్టులను రెగ్యులర్ అధికారులతో భర్తీ చేయాలని, ప్రజలకు మెరుగైన సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని సర్పంచులు డిమాండ్ చేశారు.లేనిపక్షంలో ప్రజలు మరిన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని పేర్కొన్నారు.

రమేష్, సూర్య సిద్దిపేట రూరల్.