సూర్య, చింతలమానేపల్లి : మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు చింతలమానేపల్లి పోలీస్ స్టేషన్లో బుధవారం ఓపెన్ హౌస్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసుల విధులు, పనితీరు, ప్రజలకు అందించే సేవలు, పోలీస్ స్టేషన్లో నిర్వహించే వివిధ రికార్డుల గురించి విద్యార్థులకు వివరించారు.
ఈ కార్యక్రమంలో ఎస్ఐ కమలాకర్, పోలీస్ సిబ్బంది, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఎడ్ల తిరుపతి, ఉపాధ్యాయుడు రవి తదితరులు పాల్గొన్నారు.