BREAKING
మంత్రి పొంగులేటికి వాకిటి శ్రీహరి శుభాకాంక్షలు షారుఖ్ ఖాన్ కింగ్ పోస్టర్‌పై ట్రోలింగ్.. రణ్‌వీర్ సింగ్ మూవీతో పోలికలు మలయాళ నటుడు నివిన్ పౌలీకి బిగ్ రిలీఫ్.. చీటింగ్ కేసును కొట్టివేసిన కేరళ హైకోర్టు ఉస్మానియా ఆస్పత్రి నిర్మాణ పనులు వేగవంతం చేయాలిః హైదరాబాద్ ఇంచార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ 50 ఏళ్ల మహిళగా వామికా గబ్బి.. గుర్తుపట్టలేనంతగా మేకోవర్! ఉష్ణమండల వ్యాధుల నివారణకు ఉమ్మడి కృషి అవశ్యం: డాక్టర్ అహ్మద్ రాజ‌ధానిలో తాగు నీటి స‌మ‌స్య రాకూడ‌దు .. తాగు నీరు స‌ర‌ఫ‌రా, ఎస్టీపీలపై స‌మీక్ష‌లో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి సోలార్ ప్యానెళ్ల ఏర్పాటులో కొండారెడ్డిపల్లి ఆదర్శం దత్తత ప్రక్రియను వేగవంతం చేయాలి! రాష్ట్ర దత్తత సంస్థ కార్యక్రమ నిర్వహణాధికారి సునీత యువత పొగాకు ఉత్పత్తుల కు దూరంగా ఉండాలి -ప్రోగ్రాం అధికారి డాక్టర్ ప్రదీప్ కుమార్ త్రివిక్రమ్ డైలాగులపై శ్రీనిధి శెట్టి ఆసక్తికర వ్యాఖ్యలు.. ఆదర్శ కుటుంబం విశేషాలు మంజీర నదిలో తల్లి, ఇద్దరు చిన్నారుల మృతదేహాలు వెలికితీత: ఏడుపాయల వద్ద విషాద ఘటన.. బంధువుల రోదనలు శ్రీ చైతన్య విద్యార్థులకు స్కాలర్షిప్... శ్రీరామ్ ఫైనాన్స్ సంస్థ ద్వారా ఎంపిక కరువు కష్టాలను పక్కదారి పట్టించేందుకే కాంగ్రెస్‌ డైవర్షన్‌ రాజకీయాలు : బిఆర్ఎస్ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్ రైతులకు భరోసా.. సహకార సంఘాల వద్దే వడ్లు అమ్మాలి!

ప్రైవేట్ సెక్యూరిటీ గార్డులకు యూనిఫారంలు పంపిణీ చేసిన సింగరేణి

Select Suryaa Now
ప్రైవేట్ సెక్యూరిటీ గార్డులకు యూనిఫారంలు పంపిణీ చేసిన సింగరేణి

మణుగూరు ఆర్ సి సూర్య ; మణుగూరు ఏరియా జనరల్ మేనేజర్ కార్యాలయ ప్రాంగణంలో బుధవారం 170 మంది ప్రైవేట్ సెక్యూరిటీ గార్డులకు యూనిఫారాలు మరియు విధి నిర్వహణకు అవసరమైన ఇతర సామగ్రిని పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఏరియా ఎస్ఓ టు జీఎం డి. వెంకట రామారావు మాట్లాడుతూ సింగరేణి సంస్థకు సంబంధించిన గనులు, కార్యాలయాలు, పారిశ్రామిక ప్రాంగణాలు మరియు ఇతర ముఖ్యమైన ప్రాంతాల భద్రతలో ప్రైవేట్ సెక్యూరిటీ గార్డుల పాత్ర ఎంతో కీలకమని పేర్కొన్నారు. సంస్థ ఆస్తుల పరిరక్షణ, అనధికార వ్యక్తుల ప్రవేశాన్ని నియంత్రించడం, విధి నిర్వహణలో అప్రమత్తత పాటించడం వంటి బాధ్యతలను ప్రతి సెక్యూరిటీ గార్డు సమర్ధవంతంగా నిర్వహించాలని సూచించారు.ప్రైవేట్ సెక్యూరిటీ గార్డులకు విధి నిర్వహణలో అవసరమైన సౌకర్యాలు,సామగ్రి అందించడం ద్వారా వారి పనితీరును మెరుగుపరచడంతో పాటు, క్రమశిక్షణ, బాధ్యతాయుతమైన విధి నిర్వహణ మరియు వృత్తిపరమైన నిబద్ధతను పెంపొందించవచ్చని ఆయన పేర్కొన్నారు. యూనిఫారం అనేది కేవలం దుస్తులు మాత్రమే కాకుండా, క్రమశిక్షణ, బాధ్యత మరియు విధి పట్ల నిబద్దతకు ప్రతీక అని తెలిపారు.సెక్యూరిటీ గార్డులు సమయపాలన పాటిస్తూ,పరిశుభ్రమైన యూనిఫారాలను ధరించి, తమకు కేటాయించిన విధులను అంకితభావంతో నిర్వహించాలని సూచించారు. ఒక్కొక్కరికి ఒక జత ఖాకీ యూనిఫారం, డీఎంఎస్ షూస్తో పాటు సాక్సులు, క్యాప్,లాన్యార్డ్, విజిల్,గుర్తింపు కార్డులు మరియు స్టేషనరీ పుస్తకాలు అందించడంతో పాటు, ఆసుపత్రిలో వైద్య చికిత్స సదుపాయాలు అలాగే, గనులు మరియు కార్యాలయాల పరిసరాల్లో భద్రతా నియమ నిబందనలను కచ్చితంగా పాటించాలని, అనుమానాస్పద వ్యక్తులు లేదా కార్యకలాపాలు గుర్తించినప్పుడు వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలని ఎస్వో టు జిఎం సూచించారు.ఏవైనా అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, విధి నిర్వహణలో అప్రమత్తత, పరస్పర సమన్వయం మరియు బాధ్యతాయుతమైన ప్రవర్తనకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు.
కార్యక్రమంలో ఏజీఎం (పర్సనల్)ఎస్.రమేష్, ఏరియా ఇంజినీర్ వి. మదన్ నాయక్, ఏరియా సేఫ్టీ ఆఫీసర్ జి. నాగేశ్వరరావు, ఏరియా సెక్యూరిటీ ఆఫీసర్ కె. శ్రీనివాస్, ఏరియా జూనియర్ ఇన్ స్పెక్టర్ బి. విజయేందర్, శ్రీ సాయి సెక్యూరిటీ సర్వీసెస్ కాంట్రాక్టర్ మురారి గౌడ్, ప్రైవేట్ సెక్యూరిటీ సూపర్వైజర్లు రామ అవతార్,డి.సుధాకర్ తో పాటు ప్రైవేట్ సెక్యూరిటీ గార్డులు పాల్గొన్నారు.

పొనగంటి కృష్ణ మణుగూరు ఆర్ సి సూర్య భద్రాద్రి కొత్తగూడెం జిల్లా