BREAKING
రాష్ట్రస్థాయి సైక్లింగ్ పోటీలకు వెంకటేశ్వరి ఎంపిక 14 వ వార్డు లో దూసుకుపోతున్న కాకి గంగరాజు * మద్దతుగా వెలగపూడి ప్రతాపరుద్ర * నాటుసారా, అక్రమ మద్యం రవాణా నియంత్రణకు ఆంధ్రప్రదేశ్–ఒడిశా అధికారుల సమన్వయ సమావేశం అమెరికన్ బౌద్ధ భిక్షువుకు అంతర్జాతీయ ఆధ్యాత్మిక శాస్త్రవేత్త పురస్కారం ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి బండి దీప్తిని భారీ మెజార్టీతో గెలిపించండి ఏయూ పరిశోధకురాలికి కేంద్ర సంగీత నాటక అకాడమీ ‘ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ యువ పురస్కారం’ ఏపీ ఉన్నత విద్యా ఫీజుల నియంత్రణ కమిటీ సభ్య కార్యదర్శిగా డా. ఎస్. కృష్ణయ్య నియామకం.. మూడేళ్ల పాటు డిప్యుటేషన్‌పై బాధ్యతలు అక్కంపల్లి వైసిపి, సిపిఐ ఎంపీటీసీ అభ్యర్థి గౌని శారద గెలుపు కోసం విస్తృత ప్రచారం ఏపీ నిట్ డైరెక్టర్‌గా ప్రొఫెసర్ కె.వి. కృష్ణారావు భాద్యతలు స్వీకరణ పంట నష్టాలకు పరిహారం ప్రకటించిన ప్రభుత్వం..! ఆర్నబ్ తుఫాను ప్రభావిత పంటలను పరిశీలించిన జిల్లా వ్యవసాయ అధికారి* రైతులకు శాస్త్రవేత్తల సూచనలు...!! అల్బేనియాలో ఉద్రిక్తతలు.. పార్లమెంట్‌లో ప్రతిపక్ష సభ్యుల తీవ్ర నిరసన మరియు గందరగోళం! తగ్గిన నష్టాలు.. మెరుగైన ఫలితాలు నమోదు చేసిన రెస్టారెంట్ బ్రాండ్స్ ఆసియా! గ్రామపంచాయతీ లలో క్లోరినేషన్ చేసి మంచినీటి సరఫరా చెయ్యాలి.... * డిప్యూటీ ఎంపీడీవో కేకే వర్మ*

గండిగూడెం సమస్యల పరిష్కారానికి కూటమి నాయకుల హామీ

Select Suryaa Now
గండిగూడెం సమస్యల పరిష్కారానికి కూటమి నాయకుల హామీ

టి.నరసాపురం, మేజర్ న్యూస్:గండిగూడెం గ్రామంలో నెలకొన్న ప్రధాన సమస్యలను పరిష్కరించేందుకు కూటమి నాయకులు హామీ ఇచ్చారు. బుధవారం రామాలయంలో పూజల అనంతరం ఎన్నికల ప్రచారం ప్రారంభించిన నాయకులు, కమ్యూనిటీ హాల్‌లో గ్రామస్తులు, ‘మేము సైతం మిత్ర బృందం’ సభ్యులతో సమావేశమయ్యారు.ఈ సందర్భంగా గ్రామంలోని ప్రధాన బీటీ రోడ్డు నిర్మాణం, డ్రైనేజీ వ్యవస్థ, ఉడతల మెట్ట రోడ్డు అభివృద్ధి, విద్యుత్ సమస్యలు, పక్కా ఇళ్ల మంజూరు, అసంపూర్తిగా ఉన్న అంగన్వాడీ భవనం తదితర సమస్యలను నాయకుల దృష్టికి తీసుకెళ్లారు. కూటమి అభ్యర్థులు గెలిచిన వెంటనే రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభిస్తామని, ఇందుకు తానే బాధ్యత వహిస్తానని శీలం వెంకటేశ్వరరావు హామీ ఇచ్చారు. ఇతర సమస్యల పరిష్కారానికి కూడా కృషి చేస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో సామాజిక కార్యకర్త ఎస్.డి. నాజర్ పాషా, జెడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులు, గ్రామ పెద్ద కొరివి శేషారావు, కూటమి నాయకులు జొన్నబోయిన సోంబాబు, చింతలపూడి నవీన్, పింగుల మధు, చాట్రాతి యుగంధర్ తదితరులు పాల్గొన్నారు.