BREAKING
మల్లన్నసాగర్ కట్టకింద భారీ బ్లాస్టింగ్ 35 వేల ఎకరాల్లో పంట నష్టం.. రైతులకు అండగా కూటమి ప్రభుత్వంప్రతిపక్షాల విమర్శలు విడ్డూరం : ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ మక్కువ లో హోరెత్తిస్తున్న ప్రధాన పార్టీల ప్రచారం ​బోగోలు మండలంలో ముమ్మరంగా ప్రచారం - జడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులను భారీగా గెలిపించాలంటూ ఎమ్మెల్యే ఆత్మకూరులో అదిరిన నారీభేరి ర్యాలీ --వేలాదిగా పాల్గొన్న మహిళలు బహుదా నది వరద పరిస్థితులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన జిల్లా కలెక్టర్,ఎస్పీ. టిడిపి అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలి రాష్ట్రస్థాయి సైక్లింగ్ పోటీలకు వెంకటేశ్వరి ఎంపిక 14 వ వార్డు లో దూసుకుపోతున్న కాకి గంగరాజు * మద్దతుగా వెలగపూడి ప్రతాపరుద్ర * నాటుసారా, అక్రమ మద్యం రవాణా నియంత్రణకు ఆంధ్రప్రదేశ్–ఒడిశా అధికారుల సమన్వయ సమావేశం అమెరికన్ బౌద్ధ భిక్షువుకు అంతర్జాతీయ ఆధ్యాత్మిక శాస్త్రవేత్త పురస్కారం ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి బండి దీప్తిని భారీ మెజార్టీతో గెలిపించండి ఏయూ పరిశోధకురాలికి కేంద్ర సంగీత నాటక అకాడమీ ‘ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ యువ పురస్కారం’ ఏపీ ఉన్నత విద్యా ఫీజుల నియంత్రణ కమిటీ సభ్య కార్యదర్శిగా డా. ఎస్. కృష్ణయ్య నియామకం.. మూడేళ్ల పాటు డిప్యుటేషన్‌పై బాధ్యతలు అక్కంపల్లి వైసిపి, సిపిఐ ఎంపీటీసీ అభ్యర్థి గౌని శారద గెలుపు కోసం విస్తృత ప్రచారం

ప్రధాన రహదారిపై ఇసుక వల్ల ఇబ్బంది పడుతున్న ప్రజలు,వాహనదారులు

Select Suryaa Now
ప్రధాన రహదారిపై ఇసుక వల్ల ఇబ్బంది పడుతున్న ప్రజలు,వాహనదారులు
సూర్య బెజ్జుర్ : కొమరం బీమ్ ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూర్ మండల కేంద్రంలోని ప్రధాన రహదారిపై ఇసుక పేరుకుపోవడం వల్ల వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్య కారణంగా జరుగుతున్న ప్రధాన ఇబ్బందులు మరియు ప్రమాదాలు  రోడ్డుపై పేరుకుపోయిన ఇసుక వల్ల బైకులు, స్కూటర్లు నడిపేటప్పుడు టైర్లు పట్టు కోల్పోయి వాహనదారులు కిందపడి గాయాలపాలవుతున్నారు. మలుపులు మరియు ప్రధాన కూడళ్ల వద్ద ఇసుక ఎక్కువగా ఉండటంతో వాహనాల వేగాన్ని హఠాత్తుగా తగ్గించాల్సి వస్తోంది, దీనివల్ల ట్రాఫిక్‌కు ఇబ్బంది కలుగుతోంది. వాహనాలు వెళ్లేటప్పుడు ఇసుక రేణువులు కళ్లలో పడటం, దుమ్ము లేవడంv వల్ల నడిచి వెళ్లేవారు సైతం ఇబ్బంది పడుతున్నారు.స్థానికులు మరియు వాహనదారులు సంబంధిత అధికారులు స్పందించి, ప్రధాన రహదారిపై ఉన్న ఇసుకను వెంటనే తొలగించి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.