సీఎంఆర్ఎఫ్ చెక్కు పంపిణీ చేసిన ఉప్లూర్ సర్పంచ్ :ఏనుగందుల శైలందర్
సూర్య కమ్మర్ పల్లి :
కమ్మర్‌పల్లి మండలంని ఉప్లూర్ గ్రామంలో అర్హులైన లబ్ధిదారునికి ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) చెక్కును గ్రామ సర్పంచ్ ఏనుగందుల శైలేందర్ చేతుల మీదగా పార్టీ నాయకులు స్వయంగా వారి ఇంటికి వెళ్లి పంపిణీ చేశారు.ఈ సందర్భంగా లబ్ధిదారుడు మారుపక అశోక్ కి మంజూరైన రూ.38000/- విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కును వల్ల అమ్మ మారుపక లతకి అందజేశారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డికి మరియు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి కాంగ్రెస్ పార్టీ బాల్కొండ నియోజకవర్గ ఇంచార్జ్ ముత్యల సునీల్ రెడ్డికి నిరంతరం పేద ప్రజల సంక్షేమం కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం విశేషంగా కృషి చేస్తున్నారని తెలిపారు. ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) నిరుపేద కుటుంబాలకు ఒక వరం లాంటిదని, ఆపద సమయంలో పేదలకు ఆర్థికంగా ఎంతో సహాయపడుతుందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో గ్రామ ఉప సర్పంచ్ తక్కురి శేఖర్, డీసీసీ ప్రధాన కార్యదర్శి ఏలేటి మోహన్ రెడ్డి, జిల్లా నాయకులు తిప్పిరెడ్డి శ్రీనివాస్, గ్రామ శాఖ అధ్యక్షుడు డాక్టర్ నరేష్,యూత్ కాంగ్రెస్ అద్యక్షుడు నరేందర్,కాంగ్రెస్ పార్టీ నాయకులు,బద్దం తిరుపతి రెడ్డి,సుంకరి విజయ్,క్రాంతి రెడ్డి, రాజేశ్వర్ గౌడ్, రవి గౌడ్ నజీర్, దినేష్, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.