ఘనంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలు
సూర్య, కూసుమంచి :రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ మరియు సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలను కూసుమంచి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పండుగ వాతావరణంలో ఘనంగా నిర్వహించారు. వర్షాన్ని సైతం లెక్కచేయకుండా కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు.*
*మంత్రి జన్మదినాన్ని పురస్కరించుకుని కేక్ కటింగ్ కార్యక్రమంతో పాటు తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారులకు ఉపయోగపడేలా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు స్వచ్ఛందంగా రక్తదానం చేసి మానవతా దృక్పథాన్ని చాటుకున్నారు. రక్తదానం ఆపదలో ఉన్నవారి ప్రాణాలను కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తుందనే సందేశాన్ని ఈ కార్యక్రమం అందించింది.*
*ఒకవైపు వర్షం కురుస్తున్నా, మరోవైపు అభిమానుల సందడి మధ్య జన్మదిన వేడుకలు ఉత్సాహభరితంగా సాగాయి. జన్మదిన వేడుకల్లో భాగంగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.*
*ఈ కార్యక్రమంలో కూసుమంచి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయ ఇన్‌చార్జి భీమిరెడ్డి శ్రీనివాసరెడ్డి, కూసుమంచి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బజ్జూరి వెంకట్ రెడ్డి, చైర్మన్ ఎర్రబోలు సూర్యనారాయణ రెడ్డి, నేలకొండపల్లి మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ కొండపర్తి సురేష్, డీసీసీ జిల్లా ప్రధాన కార్యదర్శి మహ్మద్ హఫీజుద్దీన్, జిల్లా ఉపాధ్యక్షుడు మంకెన వాసు, మాజీ ఎంపీపీ బానోత్ శ్రీనునాయక్, మాజీ ఎంపీటీసీ మాదాసు ఉపేందర్, నాయకులు ముదిరెడ్డి కేశవరెడ్డి, బొల్లంపల్లి సుధాకర్ రెడ్డి, భారీ వీరభద్రం, కంచర్ల జీవన్ రెడ్డి, చాట్ల పరుశురాం, జర్పుల శ్రీను నాయక్ కొర్ర రమేష్ , రామ్ కుమార్, బానోత్ శ్రీను మరియు వివిధ గ్రామాల సర్పంచులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.*