BREAKING
అధికారుల కొరతతో అభివృద్ధికి ఆటంకం బాలీవుడ్ కంటే హాలీవుడ్‌లోనే ఎక్కువ వైవిధ్యం ఉంది.. నటి ఎల్నాజ్ నౌరోజీ ఆసక్తికర వ్యాఖ్యలు! రామాయణంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడకంపై క్లారిటీ ఇచ్చిన నితీష్ తివారీ.. అసలు నిజం ఇదే! క్రీడల్లోనూ మందమర్రి మోడల్ స్కూల్ విద్యార్థిని సత్తా - రాష్ట్రస్థాయి ఫుట్‌బాల్ పోటీలకు జీ. అనూ అర్హత మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలి - బీజేపీ మండల అధ్యక్షుడు శ్రీధర్ రావు ఈ-వేస్ట్ నిర్వహణపై విద్యార్థులకు అవగాహన - నాలుగు రంగుల వ్యర్థాల సేకరణ డబ్బాల ఏర్పాటు భట్టిప్రోలు పోలీసుల పనితీరు పట్ల హర్షం ఇంచార్జీల పాలన వద్దు.. రెగ్యులర్ అధికారులే ముద్దు విద్యార్థులకు పోలీస్ విధులపై అవగాహన డ్యూన్ పార్ట్ 3 ఫైనల్ ట్రైలర్ విడుదల.. పాల్ అట్రేయిడ్స్‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న ఛానీ తిరుగుబాటు! ప్రధాన రహదారిపై ఇసుక వల్ల ఇబ్బంది పడుతున్న ప్రజలు,వాహనదారులు క్రీడలతో ఏకాగ్రత, శారీరక సమతుల్యత పెరుగుతాయి: డాక్టర్‌ నరేందర్‌ రెడ్డి మార్లవాయిలో ఫారం పాండ్ పనులు ప్రారంభం ఘనంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి జన్మదిన వేడుకలు రామాయణం లాస్ ఏంజిల్స్ ప్రీమియర్‌లో కన్నడ మూలాలపై గర్వంగా మాట్లాడిన యశ్.. నమిత్ మల్హోత్రా ప్రశంసలు!

తుఫాను నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

Select Suryaa Now
తుఫాను నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

మచిలీపట్నం, మేజర్ న్యూస్: బంగాళాఖాతంలో ఏర్పడిన అర్నబ్ తుఫాను నేపథ్యంలో మచిలీపట్నం పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎంపీ వల్లభనేని బాలశౌరి సూచించారు. తుఫాను ప్రభావంతో భారీ వర్షాలు, బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నందున అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని, అధికారులు జారీ చేసే హెచ్చరికలను పాటించాలని కోరారు. తీర ప్రాంత, లోతట్టు ప్రాంతాల ప్రజలు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని, మత్స్యకారులు సముద్రంలోకి చేపల వేటకు వెళ్లవద్దని సూచించారు. విద్యుత్ స్తంభాలు, తెగిపడిన విద్యుత్ తీగలు, పాత భవనాలు, చెట్లకు దూరంగా ఉండాలని, అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని తెలిపారు. తుఫాను సమయంలో ప్రజలకు అండగా నిలవాలని జనసేన నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. స్థానిక అధికారులతో సమన్వయం చేసుకుంటూ అవసరమైన వారికి ఆహారం, తాగునీరు, మందులు అందించే సహాయక చర్యల్లో పాల్గొనాలని సూచించారు. లోతట్టు ప్రాంతాల్లో చిక్కుకున్నవారు, వృద్ధులు, దివ్యాంగులు, చిన్నారులకు సహాయం అందించేందుకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. అయితే, అధికారుల సూచనల మేరకే సహాయక చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. తుఫాను కారణంగా ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో ముందస్తు చర్యలు తీసుకోవాలని, తీర గ్రామాలు, ముంపు ప్రాంతాల్లో సహాయక శిబిరాలు, ఆహారం, తాగునీరు, వైద్య సదుపాయాలు సిద్ధంగా ఉంచాలని కోరారు. విద్యుత్, రహదారులు, తాగునీటి సరఫరాకు అంతరాయం కలగకుండా చర్యలు చేపట్టాలని ఎంపీ బాలశౌరి సూచించారు.

 

స్టాఫ్ రిపోర్టర్: ✍️ ప్రేమ్ రాజ్, మచిలీపట్నం, కృష్ణాజిల్లా.