కరీంనగర్ టు శబరిమల మహాపాదయాత్ర ప్రారంభం
సూర్య కరీంనగర్ ప్రతినిధి ::కరీంనగర్ భగత్ నగర్ అయ్యప్ప స్వామి దేవాలయంలో శ్రీ గడప నాగరాజు గురుస్వామి ఆధ్వర్యంలో మంగళంపల్లి రాజేశ్వర శర్మ గారిచే ఇరుముడి కట్టుకొని కరీంనగర్ టు శబరిమలకు అయ్యప్ప స్వాములు బృందం బయలుదేరింది. ఈ పాదయాత్రను శ్రీ కావేటి పరమేశ్వర గురుస్వామి కొబ్బరికాయ కొట్టి జెండా ఊపి ప్రారంభించారు. 45 రోజులపాటు సాగే మహా పాదయాత్ర కరీంనగర్ హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, కేరళం రాష్ట్రంలోని శబరిమల అయ్యప్ప స్వామిని డిసెంబర్ 12వ తేదీన దర్శించుకుంటారు. ఈ అయ్యప్ప స్వామి మహా పాదయాత్ర శ్రీ గడప నాగరాజు గురుస్వామి తో కలిసి ఉమ్మడి కరీంనగర్ జిల్లా మంథని, పెద్దపల్లి, జగిత్యాల్, మంచిర్యాల జిల్లా మందమర్రి నుండి 60 మంది అయ్యప్ప స్వాములు బయలుదేరినారు. ఈ సందర్భంగా నాగరాజు గురుస్వామి మాట్లాడుతూ భక్తుల సహాయ సహకారాలతో పాటు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ గారి ఆశీస్సులతో పాదయాత్ర బృందం బయలుదేరుతుందని తిరిగి క్షేమంగా చేరుకోవాలని అయ్యప్ప స్వామిని మనసారా వేడుకున్నామని అన్నారు. అనంతరం గిద్ద పెరుమాండ్ల స్వామి దేవాలయం లో 9 డివిజన్ కార్పొరేటర్ పడిశెట్టి వసంత లక్ష్మి భూమయ్య దంపతుల అయ్యప్ప స్వాములకు అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో అయ్యప్ప స్వామి దేవాలయం చైర్మన్ యాగండ్ల అనిల్ కుమార్, దేవాలయం ప్రధాన అర్చకులు మంగళంపల్లి రాజేశ్వర శర్మ, డింగరి చాణిక్య, కావేటి పరమేశ్వర గురుస్వామి, డి సంపత్ గురు స్వామి, పోలు సత్యనారాయణ గురుస్వామి, పెద్ద పెళ్లి సాయన్న గురుస్వామి, రుద్రాక్ష కృష్ణ, శ్రావణ్ స్వామి, రంజిత్ స్వామి, గ్యాస్ శ్రీను స్వామి, హరి స్వామి జీవన్ స్వామి దేవాలయం కమిటీ సభ్యులు పాల్గొన్నారు.