BREAKING
భట్టిప్రోలు పోలీసుల పనితీరు పట్ల హర్షం ఇంచార్జీల పాలన వద్దు.. రెగ్యులర్ అధికారులే ముద్దు విద్యార్థులకు పోలీస్ విధులపై అవగాహన డ్యూన్ పార్ట్ 3 ఫైనల్ ట్రైలర్ విడుదల.. పాల్ అట్రేయిడ్స్‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న ఛానీ తిరుగుబాటు! ప్రధాన రహదారిపై ఇసుక వల్ల ఇబ్బంది పడుతున్న ప్రజలు,వాహనదారులు క్రీడలతో ఏకాగ్రత, శారీరక సమతుల్యత పెరుగుతాయి: డాక్టర్‌ నరేందర్‌ రెడ్డి మార్లవాయిలో ఫారం పాండ్ పనులు ప్రారంభం ఘనంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి జన్మదిన వేడుకలు రామాయణం లాస్ ఏంజిల్స్ ప్రీమియర్‌లో కన్నడ మూలాలపై గర్వంగా మాట్లాడిన యశ్.. నమిత్ మల్హోత్రా ప్రశంసలు! విద్యార్థులకు పోక్సో చట్టంపై అవగాహన ఎమ్మెల్యే బీవీ సమక్షంలో 80 మంది దూదేకుల వారు చేరిక సీఎంఆర్ఎఫ్ చెక్కు పంపిణీ చేసిన ఉప్లూర్ సర్పంచ్ :ఏనుగందుల శైలందర్ ఇండియన్ ఐడల్ అనుభవాలపై అమిత్ సానా సంచలన వ్యాఖ్యలు.. బాలీవుడ్ తీరుపై తీవ్ర అసంతృప్తి! ఎల్‌నినో ప్రభావాల నేపథ్యంలో రైతులు అప్రమత్తంగా ఉండాలి – వ్యవసాయ అధికారుల సూచన.. పబ్బారెడ్డి ఎన్నికల ప్రచారం.... జోరుగా..... హుషారుగా.

చల్లపల్లి-విజయవాడ రోడ్డుపై విరిగిపడిన చెట్లు తొలగింపు

Select Suryaa Now
చల్లపల్లి-విజయవాడ రోడ్డుపై విరిగిపడిన చెట్లు తొలగింపు

చల్లపల్లి, మేజర్ న్యూస్: ఆర్నబ్ తుఫాను ప్రభావంతో చల్లపల్లిలో రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. బలమైన ఈదురుగాలుల కారణంగా చల్లపల్లి-విజయవాడ రోడ్డులోని వక్కలగడ్డ సమీపంలో చెట్లు విరిగిపడి ప్రధాన రహదారికి అడ్డంగా పడ్డాయి. దీంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. బుధవారం ఉదయం ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ జిల్లా చైర్మన్ డాక్టర్ డి.ఆర్.కే. ప్రసాద్ ఆధ్వర్యంలో రెడ్‌క్రాస్ వాలంటీర్లు, స్వచ్ఛ సుందర చల్లపల్లి కన్వీనర్ డాక్టర్ తరిగోపుల పద్మావతి ఆధ్వర్యంలో కార్యకర్తలు, స్థానికులు రంగంలోకి దిగి రోడ్డుకు అడ్డంగా ఉన్న చెట్లను తొలగించారు. దీంతో వాహనాల రాకపోకలకు మార్గం సుగమమైంది. ఈ కార్యక్రమంలో పంచాయతీ ఈఓ పీవీ మాధవేంద్రరావు తదితరులు పాల్గొన్నారు.


స్టాఫ్ రిపోర్టర్: ✍️ ప్రేమ్ రాజ్, అవనిగడ్డ నియోజకవర్గం, కృష్ణాజిల్లా.