కత్తెర గుర్తుతో కొరివి శ్రీకాంత్ ప్రచారం ప్రారంభం ముత్యాలమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం
టి.నరసాపురం, మేజర్ న్యూస్:టి.నరసాపురం మండల ఎంపీటీసీ-2 అభ్యర్థిగా జనసేన పార్టీ తరఫున పోటీ చేస్తున్న కొరివి శ్రీకాంత్‌కు కత్తెర గుర్తు కేటాయించడంతో ఆయన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా గ్రామంలోని ముత్యాలమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి ఆశీస్సులు తీసుకున్నారు. అనంతరం గ్రామంలో ప్రచారం చేపట్టి ప్రజలను కలుసుకున్నారు.ఈ సందర్భంగా కొరివి శ్రీకాంత్ మాట్లాడుతూ.. ప్రజల ఆశీస్సులతో ఎంపీటీసీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని తెలిపారు. గ్రామప్రజలకుఅందుబాటులో ఉంటూ, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయడమే తన లక్ష్యమని పేర్కొన్నారు. గ్రామ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని, ప్రజల అవసరాలను గుర్తించి వాటి పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు.ఎన్నికల్లో తనకు కేటాయించిన కత్తెర గుర్తునుప్రజలు గుర్తుంచుకోవాలని కోరారు. ప్రచారంలో భాగంగా గ్రామంలోని ప్రజలను కలిసి వారి అభిప్రాయాలు, సమస్యలను తెలుసుకుంటూ ముందుకు సాగుతానని శ్రీకాంత్ తెలిపారు. ఆయన వెంట పలువురు ప్రచారలో పాల్గొన్నారు