BREAKING
పోలీస్ స్టేషన్లో  విద్యార్థులకు పోలీస్ విధులపై అవగాహన మార్వెల్ ఫ్యాన్స్‌కు దీపావళి సర్ప్రైజ్.. తెలుగులోనూ ‘అవెంజర్స్ డూమ్స్‌డే’ ముందుగానే విడుదల జెన్నిఫర్ వింగెట్‌తో విభేదాలపై పరిణీతి చోప్రా ఘాటు స్పందన.. పుకార్లను కొట్టిపారేసిన స్టార్ హీరోయిన్లు ప్రైవేట్ సెక్యూరిటీ గార్డులకు యూనిఫారంలు పంపిణీ చేసిన సింగరేణి అధికారుల కొరతతో అభివృద్ధికి ఆటంకం బాలీవుడ్ కంటే హాలీవుడ్‌లోనే ఎక్కువ వైవిధ్యం ఉంది.. నటి ఎల్నాజ్ నౌరోజీ ఆసక్తికర వ్యాఖ్యలు! రామాయణంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడకంపై క్లారిటీ ఇచ్చిన నితీష్ తివారీ.. అసలు నిజం ఇదే! క్రీడల్లోనూ మందమర్రి మోడల్ స్కూల్ విద్యార్థిని సత్తా - రాష్ట్రస్థాయి ఫుట్‌బాల్ పోటీలకు జీ. అనూ అర్హత మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలి - బీజేపీ మండల అధ్యక్షుడు శ్రీధర్ రావు ఈ-వేస్ట్ నిర్వహణపై విద్యార్థులకు అవగాహన - నాలుగు రంగుల వ్యర్థాల సేకరణ డబ్బాల ఏర్పాటు భట్టిప్రోలు పోలీసుల పనితీరు పట్ల హర్షం విద్యార్థులకు పోలీస్ విధులపై అవగాహన డ్యూన్ పార్ట్ 3 ఫైనల్ ట్రైలర్ విడుదల.. పాల్ అట్రేయిడ్స్‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న ఛానీ తిరుగుబాటు! ప్రధాన రహదారిపై ఇసుక వల్ల ఇబ్బంది పడుతున్న ప్రజలు,వాహనదారులు క్రీడలతో ఏకాగ్రత, శారీరక సమతుల్యత పెరుగుతాయి: డాక్టర్‌ నరేందర్‌ రెడ్డి

డ్రగ్స్ వాడకంతో నష్టాలపై సమన్వయంతో వివరించాలి.. కలెక్టర్, ఎస్పీ నార్కోటిక్ కంట్రోల్ సమావేశం.

Select Suryaa Now
డ్రగ్స్ వాడకంతో నష్టాలపై సమన్వయంతో వివరించాలి.. కలెక్టర్, ఎస్పీ నార్కోటిక్ కంట్రోల్ సమావేశం.

డ్రగ్స్ వాడకంతో నష్టాలపై సమన్వయంతో వివరించాలి.. కలెక్టర్, ఎస్పీ నార్కోటిక్ కంట్రోల్ సమావేశం..

సూర్య 
రాజన్న సిరిసిల్ల డ్రగ్స్ వాడకంతో కలిగే అనర్ధాలు, ఇబ్బందులపై అన్ని శాఖల అధికారులు సమన్వయంతో విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు.జిల్లా కలెక్టర్, ఎస్పీ మహేష్ బి గితె తో కలిసి వివిధ శాఖల అధికారులతో జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో బుధవారం జిల్లాస్థాయి నార్కోటిక్ కంట్రోల్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలో నమోదవుతున్న ఎన్ డీపీఎస్ కేసులు, గంజాయి సాగు నివారణ చర్యలు, మాదక ద్రవ్యాల నియంత్రణ చర్యలు, శాఖల వారీగా చేపట్టాల్సిన కార్యక్రమాలు, డ్రగ్స్ వినియోగం వల్ల కలిగే నష్టాలపై చేయాల్సిన విస్తృత ప్రచారం, డీ అడిక్షన్ కేంద్రంలో వైద్య సేవలు తదితర అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. 
జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ.. డ్రగ్స్, మాదకద్రవ్యాల నియంత్రణ కోసం జిల్లా నార్కోటిక్  సమావేశంలో పాల్గొనే ప్రతి శాఖ ప్రత్యేక కార్యచరణ రూపొందించుకొని అమలు చేయాలని  సూచించారు. డ్రగ్స్, మాదకద్రవ్యాల వినియోగంతో కలిగే నష్టాలపై పోలీస్, ఎక్సైజ్, వైద్య ఆరోగ్య శాఖ ఆద్వర్యంలో  సమన్వయంతో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. ఫుడ్ ఇన్స్పెక్టర్ షాప్ లలో తనిఖీ చేయాలని సూచించారు.మాదక ద్రవ్యాలకు బానిసైన వారిని గుర్తించి అవసరమైన చికిత్స, కౌన్సిలింగ్ అందించాలని, డీ అడిక్షన్ సెంటర్ లో జిల్లా వైద్యాధికారిని ఆదేశించారు. అటవీ శాఖ, వ్యవసాయ శాఖ అధికారులు వారి పరిధిలోని అటవీ భూములు పరిశీలించి గంజాయి సాగు కనిపిస్తే వెంటనే పోలీస్ అధికారులకు సమాచారం అందించాలని సూచించారు. 
జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల్లో డ్రగ్స్ వాడకంతో కలిగే అనర్ధాలు, ఇబ్బందులపై క్రమం తప్పకుండా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని వెల్లడించారు. వైద్య ఆరోగ్యశాఖ, ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో జిల్లాలోని 10 డిగ్రీ కళాశాలలు, 20 జూనియర్ కళాశాలల్లో దాదాపు 2,600 మంది విద్యార్థులకు అవగాహన కల్పించామని తెలిపారు. జిల్లాలోని పాఠశాలల్లో ఆరో తరగతి నుంచి పదో తరగతి విద్యార్థులను సభ్యులుగా ఒక కమిటీ ఏర్పాటు చేసి ప్రతిరోజు ప్రార్ధన సమయాల్లో డ్రగ్స్ వాడకంతో కలిగే అనర్ధాలపై అవగాహన కల్పిస్తున్నామని వెల్లడించారు. సమావేశంలో ఆర్డీవోలు శ్రీధర్ బాబు, కే ఎస్ బీ కుమారి, జిల్లా వైద్యాధికారి ఏంజెలా ఆల్ఫ్రెడ్, జిల్లా విద్యాధికారి విజయ్ సాగర్, ఇంటర్ విద్యాధికారి శరత్, మున్సిపల్ కమిషనర్లు ఖదీర్ పాషా, లోకేష్, జిల్లా ఎక్సైజ్ అధికారి హిమశ్రీ, ఫుడ్ ఇన్స్పెక్టర్ అనూష, వ్యవసాయ, కార్మిక, అటవీ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.