BREAKING
పోలీస్ స్టేషన్లో  విద్యార్థులకు పోలీస్ విధులపై అవగాహన మార్వెల్ ఫ్యాన్స్‌కు దీపావళి సర్ప్రైజ్.. తెలుగులోనూ ‘అవెంజర్స్ డూమ్స్‌డే’ ముందుగానే విడుదల జెన్నిఫర్ వింగెట్‌తో విభేదాలపై పరిణీతి చోప్రా ఘాటు స్పందన.. పుకార్లను కొట్టిపారేసిన స్టార్ హీరోయిన్లు ప్రైవేట్ సెక్యూరిటీ గార్డులకు యూనిఫారంలు పంపిణీ చేసిన సింగరేణి అధికారుల కొరతతో అభివృద్ధికి ఆటంకం బాలీవుడ్ కంటే హాలీవుడ్‌లోనే ఎక్కువ వైవిధ్యం ఉంది.. నటి ఎల్నాజ్ నౌరోజీ ఆసక్తికర వ్యాఖ్యలు! రామాయణంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడకంపై క్లారిటీ ఇచ్చిన నితీష్ తివారీ.. అసలు నిజం ఇదే! క్రీడల్లోనూ మందమర్రి మోడల్ స్కూల్ విద్యార్థిని సత్తా - రాష్ట్రస్థాయి ఫుట్‌బాల్ పోటీలకు జీ. అనూ అర్హత మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలి - బీజేపీ మండల అధ్యక్షుడు శ్రీధర్ రావు ఈ-వేస్ట్ నిర్వహణపై విద్యార్థులకు అవగాహన - నాలుగు రంగుల వ్యర్థాల సేకరణ డబ్బాల ఏర్పాటు భట్టిప్రోలు పోలీసుల పనితీరు పట్ల హర్షం విద్యార్థులకు పోలీస్ విధులపై అవగాహన డ్యూన్ పార్ట్ 3 ఫైనల్ ట్రైలర్ విడుదల.. పాల్ అట్రేయిడ్స్‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న ఛానీ తిరుగుబాటు! ప్రధాన రహదారిపై ఇసుక వల్ల ఇబ్బంది పడుతున్న ప్రజలు,వాహనదారులు క్రీడలతో ఏకాగ్రత, శారీరక సమతుల్యత పెరుగుతాయి: డాక్టర్‌ నరేందర్‌ రెడ్డి

స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీకి వైసీపీ నేతల సవాల్

Select Suryaa Now
స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీకి వైసీపీ నేతల సవాల్

నెల్లూరు సిటీ, మేజర్ న్యూస్ :   స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో నెల్లూరు జిల్లాలో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. అధికార తెలుగుదేశం పార్టీకి దీటుగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు కాకాని గోవర్ధన్ రెడ్డి, పర్వతరెడ్డి ఎన్నికల పోరులో తమదైన శైలిలో ముందుకు సాగుతున్నారు. పార్టీ అభ్యర్థుల తరఫున ఎన్నికల ప్రక్రియలో చురుకుగా వ్యవహరిస్తూ రాజకీయంగా పోటీని ఆసక్తికరంగా మారుస్తున్నారు.

నెల్లూరు నగరంలో ఏకగ్రీవాలపై ఆసక్తి

నెల్లూరు నగర కార్పొరేషన్ పరిధిలో ఇప్పటివరకు ఒక్క డివిజన్‌ను కూడా ఏకగ్రీవం కాకుండా వైసీపీ నేత పర్వతరెడ్డి పోరాటం కొనసాగిస్తున్నారనే రాజకీయ వర్గాల చర్చ ప్రాధాన్యం సంతరించుకుంది. ఎన్నికల ప్రక్రియలో అభ్యర్థుల నామినేషన్లు, పోటీ కొనసాగింపుపై వైసీపీ నేతలు దృష్టి సారించారు.  మరోవైపు, జిల్లా స్థాయిలో కాకాని గోవర్ధన్ రెడ్డి పార్టీ శ్రేణులను సమన్వయం చేస్తూ ఎన్నికల వ్యూహాలపై దృష్టి పెట్టినట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రధాన పార్టీల మధ్య పోటీ నేపథ్యంలో రానున్న పరిణామాలు, ఎన్నికల ఫలితాలు ఎలా ఉండబోతున్నాయన్నది రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.