BREAKING
సర్పంచ్ ఆధ్వర్యంలో గ్రామంలోని పలు వీధులకు మట్టి తోలకాలు.. ఏపీలో ముంచుకొస్తున్న తుఫాను ముప్పు.. 6 జిల్లాలకు రెడ్ అలర్ట్, 9 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ! జాతీయ డ్రోన్ పోటీకి గీతం క్యాడెట్ల ఎంపిక తెలంగాణ నుంచి నలుగురు ఎంపిక అందులో ఇద్దరు గీతం ఎన్.సి.సి. క్యాడెట్లు విజిలెన్స్ వారోత్సవాల సందర్భంగా పోస్టర్ను ఆవిష్కరించిన ప్రకాశం ఎస్పీ హర్షవర్ధన్ రాజు కళ్యాణదుర్గం పట్టణన్ని సుందర నగరంగా తీర్చిదిద్దుతాం. అమిలినేని యశ్వంత్. కోతుల బెడదకు చెక్ పెట్టిన ప్రగల్లపల్లి సర్పంచ్. ఘనంగా భావానంద స్వామి జయంతి ఉత్సవాలు ఎర్రబోడలో భారీ శబ్దం.. ప్రకంపనలతో ప్రజల్లో కలకలం! భూసార పరీక్షల ఆధారంగానే ఎరువుల వినియోగం జోరు వానలో సైతం వైసీపీ జడ్పిటిసి అభ్యర్థి అల్లు విజయ ముమ్మర ప్రచారం మూడో టీ20లో న్యూజిలాండ్ దూకుడు: 7.4 ఓవర్లలో 86/1 చెమల్లపల్లె ఎంపీటీసీగా చిల్లరగాళ్ల సుభాన్ బీ ఏకగ్రీవం అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటు నమోదు చేసుకోవాలి. ఎమ్మెల్యే వెంకట్రావు. 9వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థికి మద్దతుగా ఎమ్మెల్యే సతీమణి అనూష విస్తృత ప్రచారం ఇస్నాపూర్‌లో సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన

కూటమి విజయం ఖాయం.. విపక్షాల ఆశలు అడియాశలే: సీట్ల సర్దుబాటుపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్

Select Suryaa Now
కూటమి విజయం ఖాయం.. విపక్షాల ఆశలు అడియాశలే: సీట్ల సర్దుబాటుపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్

అమరావతి: అధికార కూటమిలో విభేదాలు వచ్చి బీటలు వారుతుందని ప్రత్యర్థులు ఎంతగానో ఎదురు చూశారని, కానీ ఆ అవకాశమే లేకుండా అత్యంత పారదర్శకంగా, సునాయాసంగా సీట్ల సర్దుబాటు పూర్తయిందని భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో కూటమి అగ్రనేతలు చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్‌లతో కలిసి నిర్వహించిన ఉమ్మడి విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

మూడు పార్టీల నాయకులమంతా ఒకేతాటిపైకి వచ్చి, క్షేత్రస్థాయి పరిస్థితులను బట్టి సుదీర్ఘంగా చర్చించి సీట్ల పంపకాలను కొలిక్కి తెచ్చామని మాధవ్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఎల్‌నినో ప్రభావం వల్ల ఆర్థిక, వాతావరణపరమైన సవాళ్లు ఎదురైనప్పటికీ, ప్రభుత్వం వాటన్నింటినీ అధిగమించి అభివృద్ధి పథంలో ముందుకు సాగుతోందని పేర్కొన్నారు.

2024 అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు కూటమిపై ఎంతటి అపారమైన నమ్మకాన్ని, విశ్వాసాన్ని ఉంచారో.. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ అదే స్థాయి విశ్వాసాన్ని మళ్లీ చూపించి కూటమి అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఆయన పిలుపునిచ్చారు. కూటమి నాయకులు, కార్యకర్తలు కిందిస్థాయి వరకు సమన్వయంతో పనిచేసి చారిత్రాత్మక విజయాన్ని అందించాలని ఆకాంక్షించారు.