BREAKING
హకీంపేటలో రైతు మేళాకు సన్నాహాలు.. స్థలాలను పరిశీలించిన కలెక్టర్ దీపక్ తివారి, ఎస్పీ స్నేహ మెహ్రా ఓటీటీలోకి సుందీప్ కిషన్ సినిమా.. ప్రముఖ డిజిటల్ వేదికపై స్ట్రీమింగ్ ఎప్పుడంటే? జగ్గయ్యపేట పట్టణంలో కూటమి ప్రచార హోరు నాలుగు వార్డుల్లో రాజ్యలక్ష్మి కృష్ణమూర్తి ముమ్మర పర్యటన అభివృద్ధి వైపే అడుగులు వేస్తున్నాం... కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్. జనసేన అభ్యర్థికి బీఫారం అందజేసిన సామినేని రక్తదానం మరొకరి ప్రాణాన్ని కాపాడే మహోన్నత సేవ సీపీ గౌష్ ఆలం, ఐపీఎస్ పలమనేరు ఎన్నికల బరిలో రాజ్యలక్ష్మి కృష్ణమూర్తి జోరు ముండ్లమూరులో టిడిపి హవా. మడకశిరలో చైర్మన్ కాంగ్రెస్ అభ్యర్థి నాగరాజు జోరుగా ఎన్నికల ప్రచారం. వరి పంటను పరిశీలించిన సహాయ వ్యవసాయ సంచాలకులు ఎస్. అనిల్ కుమార్ స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ, జనసేన పరస్పర అవగాహనతో ముందుకు సాగుతున్నాం........ఎమ్మెల్యే ధూళిపాళ్ళ. ఇందిరమ్మ ఇళ్ల జాబితాలో పేర్లు లేవని మహిళల ఆందోళన! డ్రగ్స్‌, గంజాయి కోసం పోలీసుల తనిఖీలు 20వ డివిజన్‌ కార్పొరేటర్ అభ్యర్థి ప్రజలకు అందుబాటులో ఉంటూ డివిజన్ ను అభివృద్ధి చేస్తా. ఎస్.కె షాహినా

జాతీయ డ్రోన్ పోటీకి గీతం క్యాడెట్ల ఎంపిక తెలంగాణ నుంచి నలుగురు ఎంపిక అందులో ఇద్దరు గీతం ఎన్.సి.సి. క్యాడెట్లు

Select Suryaa Now
జాతీయ డ్రోన్ పోటీకి గీతం క్యాడెట్ల ఎంపిక తెలంగాణ నుంచి నలుగురు ఎంపిక అందులో ఇద్దరు గీతం ఎన్.సి.సి. క్యాడెట్లు

పటాన్ చెరు ;  గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హైదరాబాదులోని ఎన్.సి.సి. క్యాడెట్లు మరోసారి తమ సత్తా చాటారు. అఖిల భారత అంతర్-డైరెక్టరేడ్ డ్రోన్ పోటీ 2026లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ (ఏపీ&టీ) డైరెక్టరేట్ కు ప్రాతినిధ్యం వహించడానికి ఇద్దరు గీతం ఎన్.సి.సి. క్యాడెట్లు ఎంపికయ్యారు. తమిళనాడులోని తిరుచెంగోడ్ లో గల కె.ఎస్. రంగస్వామి కాలేజ్ ఆఫ్ టెక్నాలజీ (కేఎస్ఆర్సీటీ)లో ఈనెల 23 నుంచి నవంబర్ 4 వరకు జరుగుతున్న పోటీలలో వీరు పాల్గొంటున్నారు.ఈ జాతీయ స్థాయి పోటీకి తెలంగాణ నుంచి కేవలం నలుగురు క్యాడెట్లు మాత్రమే ఎంపికవగా, వారిలో ఇద్దరు గీతం హైదరాబాద్ ఎన్.సి.సి. విద్యార్థులు కావడం గమనార్హం. ఎంపికైన క్యాడెట్లు- జూనియర్ అండర్ ఆఫీసర్ ఎ.అభినవ్ సాయి కార్తీక్ (సీనియర్ డివిజన్), జూనియర్ అండర్ ఆఫీసర్ తమ్ములూరి కావ్య (సీనియర్ వింగ్). వారి ఎంపిక డ్రోన్ కార్యకలాపాలలో వారి అంకితభావం, సాంకేతిక నైపుణ్యం, కృషి, ప్రతిభ, నిబద్ధతను ప్రతిబింబిస్తోంది.గీతం అసోసియేట్ ఎన్.సి.సి. అధికారి లెఫ్టినెంట్ ఎస్. అజయ్ కుమార్ మాట్లాడుతూ, ‘‘ఈ ప్రతిష్టాత్మక జాతీయ స్థాయి పోటీలో మా క్యాడెట్లు డైరెక్టరేట్ కు ప్రాతినిధ్యం వహించడం మాకు గర్వకారణం. వారి విజయం గీతం హైదరాబాదు ప్రోత్సాహాన్ని చాటిచెప్పడమే గాక, తోటి క్యాడెట్లు సాంకేతిక ఆవిష్కరణలను స్వీకరించి, ఎన్.సి.సి. కార్యకలాపాలలో రాణించడానికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తుంది’’ అని అన్నారు.గీతం హైదరాబాదు ఉన్నతాధికారులు కూడా ఈ ఇద్దరు క్యాడెట్ల అద్భుతమైన విజయాన్ని అభినందించి, వారు ఇదే ఉత్సాహాన్ని భవిష్యత్తులో కూడా కొనసాగించి, మరిన్ని విజయాలను అందుకోవాలని అభిలషించారు.