BREAKING
విద్యార్థినులకు న్యాయ* చట్టాలపై అవగాహన సదస్సు ప్రాణ నష్టం జరుగకుండా చూడండి మీ సేవకుడిగా పని చేస్తా కౌన్సిలర్ గా గెలిపించండి.. 7వ వైసిపి కౌన్సిలర్ అభ్యర్థి కృపాకర్ రెడ్డి బాక్సాఫీస్ వద్ద రికార్డుల మోత.. రూ.700 కోట్ల క్లబ్‌లో రజినీకాంత్ జైలర్ 2 పోలీస్ ఆఫీసర్‌గా సాయి పల్లవి రచ్చ.. ఆకట్టుకుంటున్న లేటెస్ట్ మూవీ టీజర్ నవంబర్ 1న పోలింగ్ జరిగే ప్రాంతాల్లో స్థానిక సెలవు ప్రకటింపు* *జిల్లా ఎన్నికల అధికారి/జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి* సోషల్ మీడియాలో రాజకీయ ప్రకటనలకు ఎంసీఎంసీ ముందస్తు ధ్రువీకరణ తప్పనిసరి* *జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి* వార్డు ప్రగతి కోసం టిడిపిని గెలిపించండి.. టిడిపి 21 వార్డు కౌన్సిలర్ అభ్యర్థి నాయకు రాజశేఖర్ 'ఆదర్శ కుటుంబం' సినిమాకు బిగ్ షాక్ లేకుండా ఊరట.. టికెట్ రేట్ల పెంపునకు ప్రభుత్వం అనుమతి ధనాపురం, హోన్నంపల్లి ఎంపీటీసీ కూటమి అభ్యర్థిగా రాజగోపాల్‌కు బీ-ఫారం అందజేత ‘బేబీ జాన్’ ఫలితంపై నటి కీర్తి సురేశ్ ఆసక్తికర వ్యాఖ్యలు.. బాలీవుడ్ ఎంట్రీపై క్లారిటీ హోస్ట్‌గా మెగాస్టార్ చిరంజీవి.. స్పెషల్ గెస్టులుగా బ్రహ్మానందం, సునీల్, సత్య ఎన్నికలు ఎందుకు పెట్టారు? క్రిస్మస్ బరిలో ‘కింగ్’ వర్సెస్ ‘కింగ్’ బాక్సాఫీస్ ఫైట్.. షారుఖ్, నాగార్జున సినిమాల రిలీజ్ డేట్ ఫిక్స్ ఫీడ్‌బ్యాక్ తీసుకునేంత శక్తి కూడా ఉండదు.. ఏఆర్ రెహ్మాన్ ఆసక్తికర వ్యాఖ్యలు

జగ్గయ్యపేట పట్టణంలో కూటమి ప్రచార హోరు

Select Suryaa Now
జగ్గయ్యపేట పట్టణంలో కూటమి ప్రచార హోరు

జగ్గయ్యపేట మేజర్ న్యూస్ :-మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో జగ్గయ్యపేట పట్టణంలో కూటమి ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. ఇందులో భాగంగా పట్టణంలోని 5వ వార్డులో కూటమి అభ్యర్థులు విస్తృతంగా పర్యటిస్తూ ప్రజల మద్దతును కోరారు.

5వ వార్డులో తెలుగుదేశం పార్టీ బలపరిచిన కూటమి చైర్మన్ అభ్యర్థి నరేంద్రుల వినిత ,జగ్గయ్యపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఎన్నికల సమన్వయకర్త, యువ నాయకులు సామినేని వెంకటకృష్ణ ప్రసాద్ , 5వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి కొలగాని రాము  స్థానిక కూటమి నాయకులతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు

వార్డులోని ప్రతి ఇంటికీ వెళ్లి ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ కూటమి అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.

ఈ సందర్భంగా కూటమి అభ్యర్థులు ప్రజలతో మమేకమై వారి సమస్యలను తెలుసుకుంటూ, పట్టణ అభివృద్ధికి కూటమి కట్టుబడి ఉందనే సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లారు. జగ్గయ్యపేట పట్టణాన్ని మరింత అభివృద్ధి పథంలో నడిపించేందుకు ప్రజల సహకారం, ఆశీస్సులు అవసరమని పేర్కొంటూ, నవంబర్ 1వ తేదీన జరగనున్న ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరారు._

అనంతరం 5వ వార్డు నుండి సామినేని ఉదయభాను  ఆశీస్సులతో జనసేన పార్టీ నుండి ఏకగ్రీవంగా ఎన్నికైన కొలగాని రాము ని ఈ సందర్భంగా అభినందించారు

 

 

 

 

 

రిపోర్టర్ :-శివా జగ్గయ్యపేట ఎన్టీఆర్ జిల్లా