ధనాపురం, హోన్నంపల్లి ఎంపీటీసీ కూటమి అభ్యర్థిగా రాజగోపాల్‌కు బీ-ఫారం అందజేత
పరిగి మేజర్ న్యూస్: పరిగి మండలంలోని ధనాపురం, హోన్నంపల్లి గ్రామపంచాయతీలకు సంబంధించి ఎంపీటీసీ కూటమి అభ్యర్థిగా రాజగోపాల్‌కు తెలుగుదేశం పార్టీ తరఫున బీ-ఫారం అందజేశారు. మంత్రివర్యులు శ్రీమతి సవితమ్మ ఆశీస్సులతో, టీడీపీ నాయకులు ప్రవీణ్ రెడ్డి, బాలాజీతో పాటు స్థానిక పంచాయతీ నాయకుల సమక్షంలో రిటర్నింగ్ అధికారికి బీ-ఫారం సమర్పించడం జరిగింది. రానున్న ఎంపీటీసీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థిగా రాజగోపాల్ బరిలో నిలవనున్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తల సహకారంతో ఎన్నికల్లో విజయం సాధించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు నాయకులు తెలిపారు.
పరిగి సూర్య రిపోర్టర్ నవీన్.