పియు పరిధిలోని ఎం ఫార్మసీ-ఎల్ ఎల్ ఎం ఫలితాలు విడుదల
మేజర్ న్యూస్, మహాబూబ్ నగర్ పియు:మహబూబ్‌నగర్: పాలమూరు యూనివర్సిటీ పరిధిలో ఎం.ఫార్మసీ, ఎల్.ఎల్.ఎం., ఎల్.ఎల్.బి. పరీక్షల ఫలితాలను ఉపకులపతి ఆచార్య జి.ఎన్. శ్రీనివాస్ ఈ రోజు ఇతర అధికారులతో కలిసి విడుదల చేశారు. ఫలితాలను ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచినట్లు తెలిపారు.ఈ సందర్భంగా *వీసీ మాట్లాడుతూ, విద్యార్థులు ఆన్‌లైన్‌లో ఫలితాలను పరిశీలించుకోవాలని సూచించారు. నాణ్యమైన విద్య, మెరుగైన విద్యా ప్రమాణాల కోసం యూనివర్సిటీ కృషి చేస్తోందని పేర్కొన్నారు.కోర్సుల వారీగా ఉత్తీర్ణత వివరాలు:
1)ఎం.ఫార్మసీ – II సెమిస్టర్ (రెగ్యులర్): 76 మందికి గాను 59 మంది ఉత్తీర్ణత సాధించారు (77.63%).
2)ఎల్.ఎల్.ఎం. – II సెమిస్టర్: 17 మందికి గాను 14 మంది ఉత్తీర్ణత సాధించారు (82.35%).
3)ఎల్.ఎల్.బి. – II సెమిస్టర్ (రెగ్యులర్/బ్యాక్‌లాగ్): 266 మందికి గాను 148 మంది ఉత్తీర్ణత సాధించారు (55.64%).
4)ఎల్.ఎల్.బి. – IV సెమిస్టర్ (రెగ్యులర్/బ్యాక్‌లాగ్): 177 మందికి గాను 117 మంది ఉత్తీర్ణత సాధించారు (66.10%).
5)ఎల్.ఎల్.బి. – V సెమిస్టర్: 19 మందికి గాను 8 మంది ఉత్తీర్ణత సాధించారు (42.11%).కార్యక్రమంలో రిజిస్ట్రార్ ఆచార్య పి. రమేష్‌బాబు, అకాడమిక్ ఆడిట్ సెల్ డైరెక్టర్ ప్రొఫెసర్ చంద్రకిరణ్,పరీక్షల నియంత్రణ అధికారి డాక్టర్ ప్రవీణ,అడిషనల్ కంట్రోలర్ అఫ్ ఎగ్జామినేషన్స్ డా అనురాధ రెడ్డి,లా కళాశాల ప్రిన్సిపాల్ డా భూమయ్య,ఫార్మసీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఈశ్వర్‌కుమార్, కోఆర్డినేటర్లు డాక్టర్ రవీందర్‌రెడ్డి, సుదర్శన్‌రెడ్డి పాల్గొన్నారు.
రిపోర్టర్ : ఓం ప్రకాష్, మహబూబ్ నగర్.