BREAKING
నెల్లూరు జిల్లాలో జరుగుతున్న లెప్రసీ కేసు డిటెక్షన్ కాంపెయిన్ సర్వే పై సమీక్ష సమావేశం. బ్యాంకింగ్ రంగంలో కలకలం రేపిన హెచ్‌ఎస్‌బీసీ నిర్ణయం సూర్య హీరోగా జితు మాధవన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సీన్ మూవీ థియేట్రికల్ అప్‌డేట్! అమెరికా మార్కెట్లలో ఉత్కంఠ వాతావరణం తోటల చెరువుపల్లి ఎంపీటీసీ ఏకగ్రీవం విరువూరులో ఎంపీటీసీ ఏకగ్రీవం ఐపీఓ మార్కెట్లలో హెచ్చరిక గంటలు మోగిస్తున్న 'స్మాష్ అండ్ గ్రాబ్' ధోరణి పునరావస కేంద్రాలు ఏర్పాటు చేయాలి కోనసీమకు ఈ రాత్రి కాళరాత్రేనా..! ఆర్నబ్ తుఫాన్ ఎఫెక్ట్.. ఓట్ చోరీపై బిజెపి ప్రభుత్వాన్ని వదిలిపెట్టే ప్రసక్తి లేదు - జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కేసీఆర్‌తో ఎమ్మెల్యే జీఎంఆర్ భేటీ అర్నబ్ తుఫాన్ దృష్ట్యా నియోజకవర్గం ప్రజలకు ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ విజ్ఞప్తి చేశారు. అభిషేక్ శర్మ వీరోచిత శతకం.. న్యూజిలాండ్‌పై ఘన విజయం సాధించి సిరీస్ కైవసం చేసుకున్న టీమిండియా! వార్డు అభివృద్ధి కోసం సైకిల్  గుర్తుకు ఓటువేసి గెలిపించండి .. ఇంటింటా ప్రచారంలో 10వ వార్డు టిడిపి కౌన్సిలర్ అభ్యర్థి షేక్ షరిపున్ తాజ్ 35 జడ్పీటీసీ స్థానాల్లో కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యం

ప్రిన్స్ అలాయిస్‌తో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ భేటీ

Select Suryaa Now
 ప్రిన్స్ అలాయిస్‌తో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ భేటీ

సూర్య నేషనల్ బ్యూరో, న్యూఢిల్లీ: అధికారిక పర్యటన నిమిత్తం భారత్‌కు విచ్చేసిన యూరోపియన్ దేశం లైకెస్టీన్  తాత్కాలిక దేశాధినేత, వారసత్వ యువరాజు అలోయిస్తో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం దేశ రాజధాని న్యూఢిల్లీలో సమావేశమయ్యారు. ఈ ఉన్నత స్థాయి భేటీలో ఇరు దేశాల మధ్య ఆర్థిక సంబంధాల బలోపేతం, వాణిజ్య విస్తరణ, పరస్పర పెట్టుబడుల అవకాశాలపై విస్తృతంగా చర్చించారు.

ఈఎఫ్‌టీఏ  ఒప్పందం నేపథ్యంలో చర్చలు:
భారత్ మరియు యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్  మధ్య కుదిరిన 'ట్రేడ్ అండ్ ఎకనామిక్ పార్ట్‌నర్‌షిప్ అగ్రిమెంట్'  అమలులోకి వచ్చిన నేపథ్యంలో ఈ సమావేశం అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ ఒప్పందం ద్వారా భారత మార్కెట్లలోకి రానున్న 100 బిలియన్ డాలర్ల పెట్టుబడుల్లో లైకెస్టీన్ సంస్థల భాగస్వామ్యం, హైటెక్ మాన్యుఫ్యాక్చరింగ్, ఫిన్‌టెక్, మరియు సుస్థిర ఆర్థిక సేవల రంగాల్లో సహకారాన్ని పెంపొందించుకోవడంపై మంత్రి నిర్మలా సీతారామన్ యువరాజుతో సమాలోచనలు జరిపారు.

రాష్ట్రపతి భవన్‌లో ఘన స్వాగతం – ద్వైపాక్షిక సంబంధాల విస్తరణ:
న్యూఢిల్లీ పర్యటనలో భాగంగా అంతకుముందు రాష్ట్రపతి భవన్‌లో ప్రిన్స్ అలాయిస్‌కు భారత ప్రభుత్వం లాంఛనప్రాయంగా ఘన స్వాగతం పలికింది. ఆయన వెంట వచ్చిన ఉన్నత స్థాయి వ్యాపార ప్రతినిధి బృందం భారత పారిశ్రామిక వేత్తలతో కూడా చర్చలు జరిపింది. నైపుణ్యాభివృద్ధి, ఆవిష్కరణలు, ఆర్థిక సేవల పరిధిని విస్తరించడం ద్వారా భారత్-లైకెస్టీన్ సంబంధాలు సరికొత్త శిఖరాలకు చేరుకుంటాయని ఇరుపక్షాలు ఆశాభావం వ్యక్తం చేశాయి.