BREAKING
హరీష్ రావు సమక్షంలో టిఆర్ఎస్ పార్టీలో చేరికలు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా ఓటర్ల జాబితాల ప్రచురణ: అభ్యంతరాల స్వీకరణకు ఆహ్వానం. పెండింగ్ కేసులను త్వరగా పరిష్కరించాలి: ఎస్పీ స్నేహ మెహ్రా షీ టీం బృందం ఆధ్వర్యంలో విద్యార్థులకు అవగాహన ఆర్యవైశ్య సంఘం సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే అశోక్ రెడ్డి, సోము వీర్రాజు కోచింగ్ ఫాకల్టీ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం కర్నూల్ వెంకటరమణ కాలనీలో వైసీపీ ప్రచారం గుడిసెలు లేని మెదక్‌ నిర్మాణమే డా. మైనంపల్లి రోహిత్ మహాసంకల్పం! అభివృద్ధే లక్ష్యంగా కూటమి అభ్యర్థుల ఇంటింటి ప్రచారం కూటమి అభ్యర్థులకు మద్దతివ్వాలని విజ్ఞప్తి - ఎమ్మెల్యే ముత్తుముల చెర్లో ఎడవల్లి ఎంపిటిసి మెంబర్ గా మాజీ ఎంపీపీ కేత వేణుగోపాల్ రెడ్డి ఎన్నిక పవర్‌పేట నుంచి పడమటవీధి జానకిగా రితికా నాయక్.. ఆకట్టుకుంటున్న గ్లింప్స్ కావలి ఎంపీటీసీ పోటీదారులకు బి-ఫారాలు అందజేసిన ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి. తూప్రాన్ పోలీస్ స్టేషన్లో ఓపెన్ హౌస్ తూప్రాన్ డిఎస్పి నరేంద్ర గౌడ్ ఆర్నబ్ తుఫాన్ ఎదుర్కొనడానికి జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉంది : బాపట్ల జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్,వి కావలిలో జనసేన ప్రభంజనం: బాడుగుడిపాడు ఎంపీటీసీ గా మాగంటి రాజ్యలక్ష్మి ఏకగ్రీవ ఎన్నిక

పునరావస కేంద్రాలు ఏర్పాటు చేయాలి

Select Suryaa Now
పునరావస కేంద్రాలు ఏర్పాటు చేయాలి

నేటి దినపత్రిక సూర్య బ్యూరో రాజమహేంద్రవరంఆర్నాబ్ తుఫాన్‌ నేపథ్యంలో ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొనేందుకు ప్రజలు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని కొత్తపేట ఆర్డీవో జి.వి.వి.సత్యనారాయణ సూచించారు.తుఫాన్ ప్రభావం అధికంగా ఉంటుందన్న వాతావరణ కేంద్ర హెచ్చరికల నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని కోరారు.కొత్తపేట మండలంలోని మద్దుల మెరక,చిన్న రామునూతి మెరక ప్రాంతాల్లో పూరి గుడిసెలు,రేకుల షెడ్లలో నివసిస్తున్న ప్రజలు సమీపంలో ఏర్పాటు చేసిన తుఫాన్ పునరావాస కేంద్రాలకు తరలివెళ్లాలని సూచించారు.ప్రజలకు అత్యవసర సేవలు అందించేందుకు మండల,డివిజన్ కేంద్రాల్లో కాల్ సెంటర్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.ఏదైనా సహాయం అవసరమైన వారు మొబైల్ నంబర్ 8500238258,ల్యాండ్‌లైన్ నంబర్ 08855-244299ను సంప్రదించాలని సూచించారు.తుఫాన్‌ను ఎదుర్కొనేందుకు అన్ని శాఖల అధికారులను అప్రమత్తం చేసినట్లు వెల్లడించారు.ఈ సందర్భంగా ఆర్డీవో వెంట తహశీల్దార్ వై.రాంబాబు,మండల రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ రవిశంకర్,గ్రామ కార్యదర్శి దుర్గ శ్రీనివాస్,రెవెన్యూ సిబ్బంది తదితరులు ఉన్నారు.

డివిజన్‌లో 192 పునరావాస కేంద్రాలు

తుఫాన్‌ ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని కొత్తపేట డివిజన్ పరిధిలో మొత్తం 192 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ఆర్డీవో జి.వి.వి. సత్యనారాయణ తెలిపారు.మండలాల వారీగా కొత్తపేటలో 26,రావులపాలెంలో 41,ఆత్రేయపురంలో 17,ఆలమూరులో 18,పి.గన్నవరంలో 39,అంబాజీపేటలో 32,అయినవిల్లిలో 19 కేంద్రాలను సిద్ధం చేసినట్లు పేర్కొన్నారు.ప్రజలు అధికారుల సూచనలు పాటిస్తూ తుఫాన్‌ ముప్పును ఎదుర్కొనేందుకు సహకరించాలని కోరారు.