BREAKING
ఏపీ స్థానిక ఎన్నికల్లో పెరిగిన నిఘా: ఒకే రోజు 9 ఎఫ్‌ఐఆర్‌లు, 1,177 కేసుల నమోదు అర్నాబ్ తుఫాను నేపథ్యంలో అప్రమత్తంగా ఉన్న బాపట్ల జిల్లా పోలీస్ యంత్రాంగం ఒంగోలు నగరపాలక సంస్థ ఎన్నికలు శాంతియుత, నిష్పక్షపాత ఎన్నికల నిర్వహణకు విస్తృత ఏర్పాట్లు పోటుమెరక గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక ఉన్నత పాఠశాలలో ఏర్పాటుచేసిన 2 పోలింగ్ స్టేషన్లను జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ అర్నబ్ తీవ్ర తుఫాన్ దృష్ట్యా తీర ప్రాంతంలోని గ్రామస్తులు అప్రమత్తంగా ఉండాలి స్థానిక ఎన్నికల ఘటనలపై ఎస్ఈసీ విచారణ చేయించాలి - మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి హ్యాండ్లూమ్ హౌస్ డైరెక్టర్‌గా కర్నాటి వజ్రమ్మ ఏకగ్రీవ ఎన్నిక వెల్దుర్తి మండలం: బరిలో నిలిచిన అభ్యర్థుల వివరాలు అన్నారం వద్ద రోడ్డు ప్రమాదం: బైక్‌ను కట్ చేస్తూ ఢీకొట్టిన ఇసుక లారీ.. యువకుడికి తీవ్ర గాయాలు! సీఎం రిలీఫ్ ఫండ్ పేదలకు వరం:కాంగ్రెస్ పార్టీ పరిగి మండల అధ్యక్షుడు వెంకట్ రాములు మర్రిపాడు ఎంపీపీ పీఠం టీడీపీ కైవసం - చక్రం తిప్పిన పుట్టం సోదరులు - 7 ఎంపీటీసీలు ఏకగ్రీవం ఆత్మకూరులో ఆనం వ్యూహం - మలుపు తిరిగిన రాజకీయం - బొమ్మిరెడ్డి రంగ ప్రవేశం - విజయ పదంలో స్థానికం తుఫానుతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి..తహశీల్దార్ నరేశ్ వేమవరంలో టీడీపీ అభ్యర్థి మాదల ఝాన్సీ లక్ష్మీ భాయ్ ఇంటింటి ప్రచారం బోగోలు ఎంపీటీసీ బరిలో 23 మంది పోటీకి సిద్ధం - ముగ్గురు ఏకగ్రీవంగా ఎంపిక

తూప్రాన్ పోలీస్ స్టేషన్లో ఓపెన్ హౌస్ తూప్రాన్ డిఎస్పి నరేంద్ర గౌడ్

Select Suryaa Now
తూప్రాన్ పోలీస్ స్టేషన్లో ఓపెన్ హౌస్  తూప్రాన్ డిఎస్పి నరేంద్ర గౌడ్

తూప్రాన్ ; తూప్రాన్ పోలీస్ స్టేషన్‌లో పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు పోలీస్ శాఖ విధులు, బాధ్యతలు, పోలీసుల త్యాగాలు మరియు పోలీస్ వ్యవస్థ పనితీరుపై అవగాహన ఎస్సై గంగరాజు ‌ ఆధ్వర్యంలో  ఓపెన్ హౌస్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తూప్రాన్ డీఎస్పీ శ్రీ నరేంద్ర గౌడ్ హాజరై విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ, సమాజంలో శాంతిభద్రతల పరిరక్షణ, ప్రజల ప్రాణాలకు మరియు ఆస్తులకు రక్షణ కల్పించడం, నేరాల నియంత్రణలో పోలీస్ శాఖ కీలక పాత్ర పోషిస్తుందని వివరించారు.విధి నిర్వహణలో భాగంగా దేశ ప్రజల రక్షణ కోసం తమ ప్రాణాలను సైతం త్యాగం చేసిన పోలీస్ అమరవీరుల సేవలను స్మరించుకుంటూ, వారి త్యాగాలు ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమని తెలిపారు. విద్యార్థులు కు పోలీసులు ఉపయోగించే తుపాకులను ‌ విద్యార్థులకు అవగాహన కల్పించారు, క్రమశిక్షణ, సమయపాలన, దేశభక్తి, చట్టాల పట్ల గౌరవం వంటి మంచి లక్షణాలను అలవర్చుకోవాలని సూచించారు. సమాజంలో బాధ్యతాయుతమైన పౌరులుగా ఎదిగి దేశ అభివృద్ధికి తమ వంతు కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో భాగంగా మెదక్ జిల్లా పోలీస్ మరియు ఏఆర్ హెడ్‌క్వార్టర్స్‌కు చెందిన పోలీస్ అధికారులు వివిధ రకాల పోలీస్ ఆయుధాలు, వాటి వినియోగం, పనితీరు మరియు విధి నిర్వహణలో వాటి ప్రాముఖ్యత గురించి విద్యార్థులకు వివరించారు. పోలీస్ శాఖలో ఉపయోగించే ఆయుధాలు, పరికరాలు, వాటి భద్రతా నియమాలు మరియు పోలీసుల విధుల గురించి విద్యార్థులకు ప్రత్యక్ష అవగాహన కల్పించారు.
ఈ ఓపెన్ హౌస్ కార్యక్రమం ద్వారా విద్యార్థులకు పోలీస్ శాఖ పనితీరు, పోలీసుల బాధ్యతలు, ఎదురయ్యే సవాళ్లు మరియు ప్రజా రక్షణలో పోలీసుల పాత్ర గురించి తెలుసుకునే అవకాశం లభించింది. అంతేకాకుండా, పోలీస్ శాఖపై విద్యార్థుల్లో అవగాహన పెంపొందించడంతో పాటు పోలీస్-ప్రజల మధ్య సత్సంబంధాలను బలోపేతం చేయడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం.
ఈ కార్యక్రమంలో ,  ఎస్ఐ జ్యోతి, ఎస్ఐ యాదగిరి, ఎస్ఐ మధుసూదన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు,