మర్రిపాడు ఎంపీపీ పీఠం టీడీపీ కైవసం - చక్రం తిప్పిన పుట్టం సోదరులు - 7 ఎంపీటీసీలు ఏకగ్రీవం
మర్రిపాడు మేజర్ న్యూస్ : మర్రిపాడుమండలంలో 13 ఎంపీటీసీ స్థానాలలో 7 ఎంపీటీసీ స్థానాలను టిడిపి ఏకగ్రీవం చేసుకొని ఎంపీపీ పీఠాన్ని మంగళవారం దక్కించుకుంది. పుట్టం విజయ నిర్మలారెడ్డి ఎంపీపీగా ఎన్నికయ్యారు. పుట్టం బ్రహ్మానందరెడ్డి, పుట్టం శ్రీనివాసులురెడ్డిలు మండల టిడిపి పగ్గాలను చేతిలో పట్టుకోవడంతో మండలంలో రాజకీయ సమీకరణలు ఏకతాటిపై నడిచాయి. ఎంపీటీసీ అభ్యర్థిగా నామినేషన్ వేసిన అన్ని పార్టీనేతలను సమన్వయం చేసి టిడిపి పార్టీ వైపు ఆకర్షింపజేశారు. మండల పరిధిలో 7 మంది టిడిపి ఎంపీటీసీ అభ్యర్థులు ఏకగ్రీవం కావడం మంత్రి ఆనం నాయకత్వంలో చరిత్రను సృష్టించింది. సింగనపల్లి, ౠదవాడ, భీమవరం, ఏపిలగుంట, పొంగూరు, పల్లవోలు, నందవరం, స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. ఈ తరుణంలో డీసీపల్లి, పడమటి నాయుడుపల్లి, చిన మాచనూరు, ఇర్లపాడు, చుంచులూరు, బ్రాహ్మణపల్లి ప్రాదేశికాలలో ఎన్నికలు జరుగుతాయి.20మంది అభ్యర్థులు తమ నామినేషన్లను విత్ డ్రా చేసుకున్నారు. ఏకగ్రీవంగా ఎన్నికైన ఎంపీపీ అభ్యర్థి విజయ నిర్మలారెడ్డి ఏకగ్రీవమైన ఎంపీటీసీ సభ్యులతో కలసి నాయకులు, కార్యకర్తలు బాణా సంచి కాల్చి, స్వీట్లు పంచుకొని సంబరాలు చేసుకున్నారు. మండలంలోని 7 ఎంపీటీసీ అభ్యర్థులను ఏకగ్రీవం చేసేందుకు మండలంలోని ప్రధానమైన తెలుగుదేశం పార్టీ నాయకులు ఏఎంసీ చైర్మన్ ఆరికట్ల జనార్ధన్ నాయుడు, మండల కన్వీనర్ దేవరాల గంగాధర్ యాదవ్, మాజీ కన్వీనర్ శాఖమూరి నారాయణ, మాజీ మండల ఉపాధ్యక్షులు కోనంకి శ్రీనివాసులు నాయుడు, మండల ప్రధాన కార్యదర్శి భూమిరెడ్డి వెంకటనారాయణ రెడ్డి, గంగినేని కొండలరావుల కృషి ఎంతగానో సహకరించింది.