షీ టీం బృందం ఆధ్వర్యంలో విద్యార్థులకు అవగాహన
పెద్ద శంకరంపేట్. : మెదక్ జిల్లా షీ టీం బృందం ఆధ్వర్యంలో పెద్ద శంకరంపేట లోని పలు పాఠశాలలో విద్యార్థులకు మెదక్ జిల్లా సిటీ ఏఎస్ఐ వెంకటయ్య అవగాహన కల్పించారు..
మంగళవారం స్థానిక మోడల్ స్కూల్, ప్రభుత్వ ఉన్నత పాఠశాల, జెడ్పీహెచ్ఎస్ మూసాపేట పాఠశాలల్లోని విద్యార్థినీ, విద్యార్థులకు మెదక్ జిల్లా షీటీం బృందం ఆధ్వర్యంలో అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు యువతులు, విద్యార్థినుల పట్ల సత్ప్రవర్తనతో మెలగాలన్నారు. షీటీం నిర్వహించే కార్యక్రమాల గురించి అందరికీ అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్ శంకరయ్య, విజయ్, విజయ్, రాణి, హెచ్ఎంలు రాజప్ప, విఠల్, ఉషారాణి, ప్రవీణ్ కుమార్, స్వరూప, రాణి, తదితరులున్నారు.